Share News

సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్‌

ABN , Publish Date - Nov 12 , 2024 | 01:10 AM

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ అన్నారు.

సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్‌

కాకినాడ సిటీ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ అన్నారు. అమరావతి సచివాలయంలో ముఖ్య మంత్రి చంద్రబాబును సోమవారం ఆయన మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలి పారు. పట్టభద్రుల నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 2లక్షల 60వేలు పట్ట భద్రుల ఓట్లు నమోదు చేయించానని సీఎం దృష్టికి తీసు కెళ్లారు. త్వరలో 3 లక్షల 50 వేల ఓట్ల నమోదు లక్ష్యానికి చేరుకుంటానన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇచ్చిన అవ కాశాన్ని బాధ్యతగా భావించి పనిచేయాలని సూచిం చారు. త్వరితగతిన అనుకున్న లక్ష్యం పూర్తి చేయాలని అభినందించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మీడియాతో మాట్లాడుతూ పట్ట భద్రు ల ఓట్లు నమోదులో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కూటమి ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ చార్జిలు, నేతలు, నాయకులు, కార్యకర్తలు, విద్యా ర్థులు సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Nov 12 , 2024 | 01:10 AM