8న సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:37 AM
అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో 8న రామచంద్రపురంలో ప్రదర్శించనున్న సంఘం శరణం గచ్చామి నాటకం కరపత్రాలు, పోస్టర్‌లను మంత్రి సుభాష్ ఆవిష్కరించారు.
రామచంద్రపురం(ద్రాక్షారామ), డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో 8న రామచంద్రపురంలో ప్రదర్శించనున్న సంఘం శరణం గచ్చామి నాటకం కరపత్రాలు, పోస్టర్‌లను మంత్రి సుభాష్ ఆవిష్కరించారు. కృత్తివెంటి పేర్రాజు పంతులు జూనియర్ కళాశాల ప్రాంగణంలో 8న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 వరకు నాటిక ప్రదర్శన ఉంటుంద న్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, దళిత ఐక్య వేదిక నాయకులు న్యాయవాదులు గాలింకి చిట్టిబాబు, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వెంటూరు సోమేశ్వరస్వామికి మంత్రి పూజలు
రాయవరం: మండలంలోని వెంటూరు పార్వతి సమేత సోమేశ్వరస్వామిని సోమవారం కార్మికశాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సోమేశ్వరస్వామికి పంచ ద్రవ్యాలతో అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి పూజ, హారతి పూజల్లో పాల్గొన్నారు. టీడీపీ నేతలు ఆలయ విశిష్టతను మంత్రికి తెలిపారు. టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి రిమ్మలపూడి వేణుగోపాలదొర, మాజీ ఎంపీటీసీ చిరట్ల అప్పారావు, మేడిశెట్టి రాం బాబు, గుత్తుల శ్రీనివాస్, వల్లూరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.