Share News

మెనూ ప్రకారం ఆహారం అందించండి

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:45 AM

రాజోలు బీసీ బాలుర హాస్టల్‌ను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ శనివారం సందర్శించారు. ఈనెలలో బీసీ హాస్టల్‌లో ఆకలి కేకలపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన శీర్షికపై కలెక్టర్‌ స్పందించి వార్డెన్‌ను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

 మెనూ ప్రకారం ఆహారం అందించండి

రాజోలు, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రాజోలు బీసీ బాలుర హాస్టల్‌ను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ శనివారం సందర్శించారు. ఈనెలలో బీసీ హాస్టల్‌లో ఆకలి కేకలపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన శీర్షికపై కలెక్టర్‌ స్పందించి వార్డెన్‌ను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. హాస్టల్‌ విద్యార్థులతో మాట్లాడి ఎమ్మెల్యే భోజన వసతి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రతీ విద్యార్థి వద్దకు వెళ్లి వారి భుజం మీద చేయివేసి తాగునీటి వసతి, ఆహార పదార్థాలు రుచికరంగా ఉంటున్నాయా అంటూ ఆరా తీశారు. మూడో తరగతి చదువుతున్న విద్యార్థి ఓలేటి వీరబాబు వద్ద నుంచి సస్పెండ్‌ అయిన వార్డెన్‌ రూ.1800 తీసుకున్నారని, మిగతా విద్యార్థుల వద్ద నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడని విద్యార్థులంతా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి టీవీ ప్రసాద్‌ను ఏ విద్యార్థుల వద్ద వార్డెన్‌ ఎంత డబ్బులు తీసుకున్నాడో ఆ డబ్బులు తిరిగి విద్యార్థులకు అందజేయాల్సిందిగా సూచించారు. గత తొమ్మిది నెలలుగా మెస్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని జిల్లా అధికారి ప్రసాద్‌ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. హాస్టల్‌ విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం ఆహారం అందించాలని సూచించారు. వంట గదిలోకి వెళ్లి భోజనం, కూరలను స్వయంగా ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎంఏ వేమా, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ గుండుబోగుల పెద్దకాపు, రాజోలు ఎంపీపీ కేతా శ్రీను, రాజోలు మండలం టీడీపీ అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి చాగంటి స్వామి, రాజోలు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు సూరిశెట్టి శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ పొలమూరి శ్యామ్‌బాబు, ఉప సర్పంచ్‌ పామర్తి రమణ, గాలిదేవర వెంకన్నబాబు, గెడ్డం మహాలక్ష్మిప్రసాద్‌, మానుకొండ దుర్గాప్రసాద్‌, ఎం.లక్ష్మి, చెల్లింగి జాంబవతి, గుండాబత్తుల తాతాజీ పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 12:45 AM