Share News

మెట్ల సత్యనారాయణరావుకు నివాళి

ABN , Publish Date - Dec 26 , 2024 | 12:23 AM

మాజీ మంత్రి దివంగత నేత డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావు 9వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. అమలాపురం పట్టణంలోని ఎర్రవంతెన సమీపంలో గల మెట్ల సత్యనారాయణరావు స్మారక ఘాట్‌ వద్ద జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన నేతలు బుధవారం ఘనంగా నివాళులర్పించారు.

 మెట్ల సత్యనారాయణరావుకు నివాళి

అమలాపురం, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి దివంగత నేత డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావు 9వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. అమలాపురం పట్టణంలోని ఎర్రవంతెన సమీపంలో గల మెట్ల సత్యనారాయణరావు స్మారక ఘాట్‌ వద్ద జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన నేతలు బుధవారం ఘనంగా నివాళులర్పించారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తొలుత నల్లవంతెన వద్దనున్న మెట్ల సత్యనారాయణరావు విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, దాట్ల బుచ్చిబాబు, జడ్పీ మాజీ చైర్మన్‌ నామన రాంబాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబుతో పాటు టీడీపీ, జనసేనకు చెందిన అనేక మంది నాయకులు మెట్ల ఘాట్‌ వద్ద ఆయన స్మారక చిహ్నం వద్ద ఘన నివాళులర్పించారు. కోనసీమలో రాజకీయంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి ఈప్రాంత ప్రజల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన మెట్ల సత్యనారాయణరావు ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అమలు చేయాల్సిందిగా ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. తొలుత మెట్ల రమణబాబు ఇంటి వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లిన టీడీపీ నాయకులు నల్లవంతెనతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సత్యనారాయణరావు విగ్రహాలకు పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించి ఘాట్‌ వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో అముడా చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, చిల్లా పురుషోత్తం, టీడీపీ నాయకులు, దెందుకూరి సత్తిబాబురాజు, నల్లా స్వామి, పెచ్చెట్టి విజయలక్ష్మి, అధికారి జయవెంకటలక్ష్మి, బొర్రా ఈశ్వరరావు, జంగా అబ్బాయివెంకన్న, దున్నాల దుర్గ, చిక్కాల గణేష్‌, బోనం సత్తిబాబు, శిరిగినీడి వెంకటేశ్వరరావు, గంపల సత్యప్రసాద్‌, యేడిద శ్రీను, కంచిపల్లి అబ్బులు, వలవల శివరావు, ఆశెట్టి ఆదిబాబుతో పాటు అనేకమంది టీడీపీ, జనసేనకు చెందిన నేతలు పాల్గొన్నారు. కమ్యూనిస్టు నేత కె.సత్తిబాబు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నల్లా విష్ణు, బీజేపీ నాయకుడు నల్లా పవన్‌కుమార్‌తో పాటు అనేక మంది మెట్ల ఘాట్‌ను సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. కోనసీమ ప్రాంత అభివృద్ధికి డాక్టర్‌ మెట్ల చేసిన కృషిని కొనియాడుతూ పలువురు వక్తలు ప్రసంగాలు చేశారు.

Updated Date - Dec 26 , 2024 | 12:23 AM