వైసీపీ సోషల్ మీడియా మూకలను వదలొద్దు
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:59 AM
వైసీపీ సోషల్ మీడియా అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ సోషల్ మీడియా అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. అసెంబ్లీ సమావేశంలో శనివారం కొన్ని ప్రధాన సమస్యలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ పాలనలో కల్తీ మద్యం మృతులపై అసెంబ్లీలో తన భార్య అప్పటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మాట్లాడితే తన కుటుంబంపైన దారుణంగా ట్రోల్ చేసిన వైసీపీ మూకలపై కఠినచర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. గత ఐదేళ్లలో టీడీపీ, జనసేనలో యాక్టివ్‌గా ఉండే కీలకమైన నాయకులపై వైసీపీ సోషల్ మీడియా లో అసభ్యకర, అభ్యంతరకర పోస్టులతో ఇబ్బంది పెట్టారని తెలిపారు. రాజమహేంద్రవరంలో మొదటి దిశ పోలీస్ స్టేషన్ అంటూ ఆర్భాటంగా ప్రారంభించగా నాటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆ స్టేషన్‌లో తనపై జరిగిన దుష్ప్రచారంపై మొదటి కేసు నమోదు చేయిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.