Share News

మెరుగైన చేతిరాతతో ఉజ్వల భవిత

ABN , Publish Date - Dec 17 , 2024 | 12:49 AM

పిఠాపురం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచి మెరుగైన చేతిరాతతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర పర్యాటకశాఖా మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. భారతీరంగా ఆర్గనైజేషన్‌ ఫర్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ సొసైటీ (బ్రోవ్స్‌) సంస్థ వ్యవస్థాపకుడు వెంకట శ్రీధర్‌ ఆధ్వర్యం లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 12వేల మంది విద్యార్థుల చేతిరాతను మెరుగుపరిచే నైపుణ్య కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని

మెరుగైన చేతిరాతతో ఉజ్వల భవిత
పిఠాపురంలో నైపుణ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి దుర్గేష్‌

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్‌

పిఠాపురంలో విద్యార్థుల చేతిరాత మెరుగుపరిచే నైపుణ్య కార్యక్రమం

పిఠాపురం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచి మెరుగైన చేతిరాతతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర పర్యాటకశాఖా మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. భారతీరంగా ఆర్గనైజేషన్‌ ఫర్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ సొసైటీ (బ్రోవ్స్‌) సంస్థ వ్యవస్థాపకుడు వెంకట శ్రీధర్‌ ఆధ్వర్యం లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 12వేల మంది విద్యార్థుల చేతిరాతను మెరుగుపరిచే నైపుణ్య కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం పట్టణంలోని ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం మంత్రి దుర్గేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల చేతిరాత మెరుగపరిచే విధంగా శిక్షణ ఇవ్వ డంతో పాటు అందుకు అవసరమైన పుస్తకాలు, ఇతర సామగ్రిని ఉచితంగా ఇచ్చేందుకు బ్రోవ్స్‌ సంస్థ ముందుకురావడం అభినందనీయమన్నా రు. ఇందుకోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. చేతిరాతను మెరుగుపరుచుకోవడం ద్వారా తమ భవిష్యత్తును విద్యార్థులు ఉ న్నతంగా తీర్చిదిద్దుకోగలుగుతారని, ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టిడ్కో చైర్మన్‌ వేములపాటి అజయకుమార్‌, కుడా చైర్మన్‌ తుమ్మల రామస్వామి(బాబు), జనసేన పిఠాపురం ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, డీవైఈవో వెంకటేశ్వరరావు, మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావు తదితరులున్నారు.

Updated Date - Dec 17 , 2024 | 12:49 AM