12:30 కాలేదు ఉద్యోగులు ఎక్కడమ్మా!
ABN , Publish Date - Dec 20 , 2024 | 01:18 AM
రాజమహేంద్రవరం 45, 46 డివిజన్ల పరిధిలోని 83,84,85,86 సచివాలయాలను తనిఖీ చేసి ఎమ్మెల్యే విస్తుపోయారు.
రాజమహేంద్రవరం సిటీ,డిసెంబరు 19 ( ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం 45, 46 డివిజన్ల పరిధిలోని 83,84,85,86 సచివాలయాలను తనిఖీ చేసి ఎమ్మెల్యే విస్తుపోయారు. 86వ సచివాలయానికి తాళాలు వేసి ఉండడం చూసి మండిపడ్డారు. ఇంకా 12:30 గంటలు కూడా కాకుండానే సిబ్బంది ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.అడ్మిన్ సెలవులో ఉన్నారని తెలుసు కు ని..ఆపై బాధ్యత నిర్వహించాల్సిన లక్ష్మి సూర్య అనే ఉద్యోగిని అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కమిషనర్ కేతన్‌గార్గ్‌కు ఫోన్ చేసి 86వ సచివాలయం ఉద్యోగులను మార్చాలని సూచించారు. వివిధ సమస్యలపై సచివాలయానికి వచ్చే ప్రజలకు ఉద్యోగులు అందుబాటులో లేకపోతే ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు.మిగిలిన సచివాలయాల్లో రిజిస్టర్లను తనిఖీ చేశారు. పాతపద్ధతులు మార్పుకోవాలని సూచించారు.