Share News

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు..

ABN , Publish Date - Nov 11 , 2024 | 01:21 AM

ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది.

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు..

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

కలెక్టరేట్‌(కాకినాడ), నవంబరు 10 (ఆంధ్ర జ్యోతి): ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. కాకినాడ కలెక్టరేట్‌ కోర్టుహాలులో ఈ మేరకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీక రిస్తారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలోకి మూడు కార్లకు అనుమతి ఇస్తారు. కోర్టు హాలులో నామినేషన్‌ సమర్పించేందుకు అభ్యర్థితోపాటు ఐదుగురికి మాత్రమే అనుమతి ఇస్తారు. అభ్యర్థులకు ఉండే సందేహాల నివృత్తికి ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను కూడా ఏర్పాటు చేశారు. సోమవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను జిల్లా రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ షాన్‌మోహన్‌ విడుదల చేస్తా రు. నామినేషన్ల పరిశీలనకు ప్రత్యేక అధికారుల బృందాన్ని నియ మించారు. ఈనెల 18వ తేదీ వరకు నామి నేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 19న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈనెల 21న నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. డిసెం బరు 5న పోలింగ్‌, డిసెంబరు 9న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మొత్తం ఓటర్లు 16,316 మంది

ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 16,316 మంది ఉన్నారు. మొత్తంగా 116 పోలింగ్‌ కేంద్రా లను అధికారులు ఏర్పాటు చేశారు.

ఆరు జిల్లాల నుంచి కాకినాడకే కావాలి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆరు జిల్లాల నుంచి కాకినాడ కలెక్టరేట్‌కు రావాలి. దీనిలో కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉన్నాయి.

ఎమ్మెల్సీ మృతి చెందడంతో ఉప ఎన్నిక

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన పీడీఎఫ్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ గతేడాది డిసెంబరు 15న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఈ ఉపఎన్నిక జరుగు తుంది. 2021లో జరిగిన ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజక వర్గం నుంచి పీడీఎఫ్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్‌ సాబ్జీ ఎన్నికయ్యారు. వాస్తవానికి ఆయన పదవీకాలం 2027, మార్చి 29వతేదీ వరకు ఉంది. రోడ్డుప్రమాదంలో మృతి చెందడం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది.

Updated Date - Nov 11 , 2024 | 01:21 AM