Share News

92.62 శాతం ఓటెత్తారు!

ABN , Publish Date - Dec 06 , 2024 | 12:37 AM

ఓటు విలువ తెలిసినోళ్లు.. తమకు నచ్చిన.. తాము మెచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటెత్తారు.. జరిగేది ఉప ఎన్నికైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదు.. తాయిలాల్లేకున్నా.. గిఫ్ట్‌ బాక్సులు ఇవ్వకున్నా.. పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు.. 60 శాతం.. 70 శాతం కాదు.. ఒక దశలో నూరుశాతం ఓటింగ్‌ ఉంటుందా అనేటంతగా క్యూకట్టారు.. చివరికి ఆరు జిల్లాల పరిధిలో 92.62 శాతం మంది బ్యాలెట్‌ ఓటేశారు..

92.62 శాతం ఓటెత్తారు!
పిఠాపురంలో కాకినాడ ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌తో మాట్లాడుతున్న ఎన్నికల ప్రత్యేకాధికారి హర్షవర్థన్‌

ఎక్కడికక్కడ క్యూకట్టిన టీచర్లు

ఉత్సాహంగా బ్యాలెట్‌ ఓటు

ఆరు జిల్లాల పరిధిలో ఇదే సీన్‌

116 కేంద్రాల్లో పోలింగ్‌

బరిలో ఐదుగురు అభ్యర్థులు

కోనసీమలో అత్యధిక ఓటింగ్‌

అల్లూరి జిల్లాలో అత్యల్పం

కాకినాడలో కంట్రోల్‌ రూమ్‌లు

జేఎన్‌టీయూలో స్ట్రాంగ్‌ రూమ్‌

రాత్రికే తరలిన బాక్సులు

9న కౌంటింగ్‌.. ఫలితం

12 వరకూ ఎన్నికల కోడ్‌

కలెక్టరేట్‌(కాకినాడ),డిసెంబరు5(ఆంధ్రజ్యోతి): ఓటు విలువ తెలిసినోళ్లు.. తమకు నచ్చిన.. తాము మెచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటెత్తారు.. జరిగేది ఉప ఎన్నికైనా ఎక్కడా వెనక్కి తగ్గలేదు.. తాయిలాల్లేకున్నా.. గిఫ్ట్‌ బాక్సులు ఇవ్వకున్నా.. పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తారు.. 60 శాతం.. 70 శాతం కాదు.. ఒక దశలో నూరుశాతం ఓటింగ్‌ ఉంటుందా అనేటంతగా క్యూకట్టారు.. చివరికి ఆరు జిల్లాల పరిధిలో 92.62 శాతం మంది బ్యాలెట్‌ ఓటేశారు.. మరో మూడు రోజుల్లో మా.. స్టారెవరో తేలిపోనుంది.. ఎందుకంటే 9న కౌంటింగ్‌.. అదే రోజు ఫలితం వెల్లడిస్తారు.. మొత్తం మీద ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ఉపపోరు గురువారం ప్రశాంతంగా ముగిసింది. మాస్టార్లు ఓటెత్తారు.. ఓటుకు క్యూకట్టారు. నూరుశాతం దిశగా ఓటింగ్‌ సాగింది.. ఆరు జిల్లా ల పరిధిలో ఎక్కడా ఓటింగ్‌ తగ్గుముఖం పట ్టలేదు. దూరాన్ని సైతం లెక్కచేయకుండా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. మహిళా ఉపాధ్యాయి నులు పోటెత్తారు. ఎక్కడా ఎటువంటి అవాంఛ నీయ సంఘటనలు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్ని కల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఆరు జిల్లాల పరిధిలో 116 పోలింగ్‌ కేంద్రాల్లో 92.62 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 16737 మం ది ఓటర్లకు 15,502 మంది ఓటు హక్కు విని యోగించుకున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్‌ జరిగింది. కాకినాడ కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసి ఏఆర్వో ఆధ్వర్యంలో వివిధ పోలింగ్‌ కేంద్రాల్లో జరుగు తున్న పోలింగ్‌ సరళిని నిత్యం పర్యవేక్షించారు. కంట్రోల్‌ రూమ్‌ నుంచి ప్రతి రెండు గంటలకు ఓటింగ్‌ శాతం విడుదల చేశారు. ఎన్నికల సంద ర్భంగా కాకినాడ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ల ను ఏర్పాటుచేశారు. పోలింగ్‌ ముగిసిన అనం తరం బ్యాలెట్‌ బాక్సులను కాకి నాడ జేఎన్‌టీ యూలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సెంట్రల్‌ లైబ్ర రీ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్ర పర్చారు. అన్ని జిల్లాల నుంచి గురువారం రాత్రి స్ర్టాంగ్‌రూమ్‌కు బ్యాలెట్‌ బాక్సులు చేరుకున్నాయి. పోలింగ్‌ సిబ్బంది నుంచి పోలింగ్‌ సామగ్రిని తీసుకునేందుకు ప్రత్యేక రిసెప్షన్‌ కౌంటర్లు ఏర్పా టుచేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సం బంధించి కాకినాడ జేఎన్‌టీయూలో ఈనెల 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు సాయంత్రానికి ఫలితాలను వెల్లడి స్తారు. ఐదుగురు అభ్యర్థులు పోటీపడు తుండగా, విజేత ఎవరో తేలిపోతుంది. 12వ తేదీతో ఎన్నికల కోడ్‌ ముగుస్తుంది.

తూర్పున 92.07 శాతం

రాజమహేంద్రవరం, డిసెంబరు 5 (ఆంధ్ర జ్యోతి) : తూర్పుగోదావరి జిల్లాలో 92.07 శా తం ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో మొత్తం 29 90 మంది ఓటర్లు ఉండగా 2753 మంది ఓటే శారు. 237 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. ఉదయం 10 గంటలకు 20.90 శాతం, 12 గం టలకు 51.70 శాతం, మధ్యాహ్నం 2 గంటలకు 74.28 శాతం, సాయంత్రం 4 గంటలకు 90.54 శాతం పోలైంది. మొత్తం ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కొంత మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు. ప్రభుత్వ ఉపా ధ్యాయులంతా ఓటు హక్కు వినియోగించుకు న్నట్టు చెబుతున్నారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేసేవారే కొంతమంది రాలేదనేది సమాచా రం.జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్‌ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.పోలింగ్‌ అ నంతరం బ్యాలెట్‌ బాక్సులను రాజమహేం ద్రవ రం ఆర్ట్స్‌ కాలేజిలో స్ర్టాంగ్‌ రూమ్‌లో భద్ర పరిచారు.వీటిని జిల్లా రెవిన్యూ అఽధికారి (డీఆ ర్వో) టి.సీతారామమూర్తి,ఆర్డీవోలు ఆర్‌. కృష్ణనా యక్‌,రాణి సుస్మిత, ఎలక్షన్‌ సెక్షన్‌ సూపరిం టెండెంట్‌ దేవి తదితరులు పర్యవేక్షించారు. ఎన్నికల పరిశీలకుడు కె.హర్షవర్థన్‌ స్ర్టాం గ్‌ రూమ్‌ ఇక్కడ భద్రత ఏర్పాట్లను పరి శీలిం చారు.నల్లజర్లలో పోలింగ్‌ కేంద్రాన్ని ఎమ్మెల్సీ అభ్యర్థి గోపిమూర్తి పరిశీలించారు.

కోనసీమలో 95.21 శాతం

అమలాపురం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. 22 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచే ఓటింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగిసింది. 95.21 శాతం మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకున్నట్టు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి వి.మదన్మోహనరావు తెలిపారు. ఉదయం పోలింగ్‌ ప్రక్రియ మందకొడిగా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నానికి ఊపందుకుంది. జిల్లాలో 3296 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 3138 మంది ఓటు హక్కును వినియోగించు కున్నారు. 158 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 2165 మంది పురుష ఓటర్లకు 2060 మంది, 1131 మంది మహిళా ఓటర్లకు 1078 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 95.21 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్కే ప్రసాద్‌, పట్టణ సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.అమలాపురం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బూత్‌ నంబరు 60లో అత్యధికంగా 606 మంది ఓటర్లు ఉండగా 574 మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 94.72 శాతం నమోదైంది.

3 ఓట్లు.. 150 కి.మీ

వై.రామవరం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం ఎగువ ప్రాంతమైన డొంకరాయి 6వ నెంబరు పోలింగ్‌ బూత్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడే ఓట్లు ఉన్నాయి. వై.రామవరం నుంచి ఎన్నికల నిర్వహణ సిబ్బంది 150 కిలోమీటర్లు తరలివెళ్లి పోలింగ్‌ నిర్వహించారు. ముగ్గురు ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించు కున్నారని జోనల్‌ అధికారి బాపన్నదొర చెప్పారు.

ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదా వరి జిల్లాల ఆరు జిల్లాల పరిధిలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌ శాతం ఇలా నమోదైంది.

ఓటింగ్‌ ఇలా..

జిల్లా కేంద్రాలు ఓట్లు పోలైనవి శాతం

అల్లూరి 12 637 565 88.70

తూర్పు 20 2990 2753 92.07

ఏలూరు 20 2667 2444 91.64

కాకినాడ 22 3418 3118 91.22

కోనసీమ 22 3296 3138 95.21

పశ్చిమ 20 3729 3484 93.43

మొత్తంగా 116 16737 15502 92.62

Updated Date - Dec 06 , 2024 | 12:37 AM