కోతులు కూల్చిన ఇల్లు
ABN , Publish Date - Dec 07 , 2024 | 01:21 AM
కూనవరం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా కూనవరంలో బల్లా ఉమా దుర్గకు చెందిన ఇల్లు శుక్రవారం తెల్లవారుజామున వానరుల దండు కారణంగా కుప్పకూలింది. 2రోజుల క్రితం కూనవరంలో స్వల్పంగా భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ భూకంపందాటికి కూనవరం పంచాయతీ దగ్గరలో ఉన్న ఓ భారీ రావి
భూకంపధాటికి బీటలువారిన రావి చెట్టు కొమ్మలు
కూనవరం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా కూనవరంలో బల్లా ఉమా దుర్గకు చెందిన ఇల్లు శుక్రవారం తెల్లవారుజామున వానరుల దండు కారణంగా కుప్పకూలింది. 2రోజుల క్రితం కూనవరంలో స్వల్పంగా భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ భూకంపందాటికి కూనవరం పంచాయతీ దగ్గరలో ఉన్న ఓ భారీ రావిచెట్టు కొమ్మ బీటలు వారింది. సగం వరకు బీటలు వారడంతో అప్పటికే ఆ రావి చెట్టు కొమ్మ కిందపడిపోయే స్థాయిలో ఉంది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా వానరుల దండు ఆ రా విచెట్టు కొమ్మపై ఊగిసలాడడంతో వాటి బరువుకు ఆ కొమ్మ కిందపడిపోయింది. కొమ్మ కిం ద ఉమాదేవి ఇల్లు ఉండడంతో రేకులు, గోడ లు కుప్పకూలిపోయాయి. ఉమాదేవి కు టుం బం ఆసుపత్రికివెళ్లడంతో ప్రమాదం తప్పింది.