Share News

రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వాలు

ABN , Publish Date - Nov 19 , 2024 | 12:59 AM

రానున్న రోజుల్లో బీజేపీని ఆశీర్వదించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో 25 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు జరగడమే ఇందుకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

రాష్ట్రంలో 25 లక్షల సభ్యత్వాలు
రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరిన పలు పార్టీల నాయకులు

రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : రానున్న రోజుల్లో బీజేపీని ఆశీర్వదించడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో 25 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు జరగడమే ఇందుకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమ హేంద్రవరం బీజేపీ కార్యాలయంలో సోమవా రం సాయంత్రం వైసీపీ నాయకుడు తగరం సురేష్‌బాబుతో పాటు పలువురు దళిత, మైనార్టీలు బీజేపీలో చేరారు. పార్టీ కండువాలను కప్పి వారిని బీజేపీలోకి ఆహ్వానించి మాట్లా డారు. అంబేడ్కర్‌ పేరు చెప్పుకున్న పార్టీలు ఆయనకు చేసిందేమీలేదన్నారు. మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకు చేస్తున్న పోరాటం గురించి మోదీ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఒక కమిటీ వేయడం జరిగిందని, రిపోర్టు కూడా రావడం జరిగిందని, సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి పెద్దఎత్తున సహకారం అందిస్తున్నదన్నారు. గ్రామీణాభివృద్ధిపై గత ప్రభుత్వం శీతకన్ను వేయడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, గ్రామీణాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ఇలాంటి పరిస్థితిలో కేంద్రం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి రూ.4,800 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో భారీగా సభ్యత్వాలు నమోదు చేసిన ప్రతి కార్యకర్తలకు అభినందనలు తెలుపుతున్నానన్నారు.కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి మాట్లాడారు. పార్టీ నాయకులు మాలతిరాణి పాల్గొన్నారు.

తాడిపర్రు మృతులకు సంతాపం

ఉండ్రాజవరం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : తాడిపర్రు మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. తాడిపర్రులో విద్యుదాఘాతానికి గురై మరణించిన బొల్లా వీర్రాజు, మారిశెట్టి మణికంఠ, కాసకాని కృష్ణ, పామర్తి నాగేంద్ర కుటుంబాలను సోమవారం పరామర్శించారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, మండల టీడీపీ అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, సర్పంచ్‌ కరుటూరి నరేంద్రబాబు, కూటమి నాయకులు పెండ్యాల గోవిందరావు,రాచమళ్ల శ్రీనివాసరావు, అక్కిన గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 12:59 AM