Share News

రామచంద్రపురం మున్సిపల్‌ డీఈఈ గుండెపోటుతో మృతి

ABN , Publish Date - Jul 07 , 2024 | 12:27 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపల్‌ డీఈఈ దుర్గాప్రసాద్‌ శనివారం గుండెపోటుతో షిర్డీలో మృతి చెందారు.

రామచంద్రపురం మున్సిపల్‌ డీఈఈ గుండెపోటుతో మృతి

మండపేట/ద్రాక్షారామ, జూలై 6: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపల్‌ డీఈఈ దుర్గాప్రసాద్‌ శనివారం గుండెపోటుతో షిర్డీలో మృతి చెందారు. దుర్గాప్రసాద్‌ కుటుంబ సమేతంగా రెండు రోజులు క్రితం షిర్డీ వెళ్లారు. ఆయన శనివారం స్వామివారి దర్శనం కోసం క్యూలో ఉండగా గుండెపోటు రావడంతో క్యూలైన్‌లోనే ప్రాణాలు విడిచారు. దుర్గాప్రసాద్‌ సమర్ధవంతమైన అధికారిగా మంచి పేరుంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన సుదీర్ఘకాలం మండపేట మున్సిపల్‌ కార్యాలయంలో ఏఈగా పనిచేశారు. ఇన్‌చార్జి కమిషనర్‌గా, డీఈఈగా ఆయన ఇక్కడ పనిచేశారు. విజయవాడ నగర కార్పొరేషన్‌లో కూడా విధులు నిర్వర్తించారు. మండపేట నుంచి రామచంద్రపురం మున్సిపల్‌ కార్యాలయానికి పదోన్నతిపై డీఈఈగా బదిలీ ఆయ్యారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జునచౌదరి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చుండ్రు శ్రీవరప్రకాష్‌, రెడ్డి రాజబాబు, మండపేట మున్సిపల్‌ డీఈఈ ఆర్‌.శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఆర్‌ఐ ఐ.ప్రభాకరచౌదరి, మండపేట, రామచంద్రపురం మున్సిపల్‌ ఉద్యోగులు సంతాపం తెలిపారు.

Updated Date - Jul 07 , 2024 | 12:27 AM