సాదాసీదాగా మున్సిపల్ సమావేశం
ABN , Publish Date - Feb 29 , 2024 | 12:30 AM
సాదాసీదాగా మున్సిపల్ సమావేశం
మండపేట, ఫిబ్రవరి 28 మండపేట మున్సిపల్ సాధారణ సమావేశం బుధవారం చైర్‌పర్సన్ పతివాడ నూకదుర్గారాణి అధ్యక్షతన జరిగింది. వైసీపీ కౌన్సిలర్లు, ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. ఎమ్మెల్యే వేగుళ్ల, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పలువురు టీడీపీ కౌన్సిలర్లు హాజరుకాలేదు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే అజెండాలో అంశాలను ఆమోందించి సమావేశాన్ని ముగించేశారు. పట్టణంలో 25ఏళ్ల నుంచి రైస్‌మిల్లుల నుంచి వస్తున్న నల్ల బూడిద వల్ల కలిగే నష్టం గురించి కోఆప్షన్ సభ్యుడు రెడ్డి రాధా కృష్ణ సమా వేశం దృష్టికి తీసుకువచ్చారు. ఏడిదరోడ్డులో వున్న రైస్‌మిల్లుల నుంచి వస్తున్న కాలుష్యం నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయన, సభ్యులు కోరారు. పట్టణంలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌తో తనిఖీలు నిర్వహిం చాలని సభ్యులు కోరారు. పట్టణంలో కుక్కలు బెడద ఉందని, చర్యలు తీసుకో వాలని సభ్యులు కోరారు. కమిషనర్ బి.రాము, కౌన్సిలర్లు పాల్గొన్నారు.