Share News

మున్సిపాలిటీలకు మహర్దశ

ABN , Publish Date - Dec 25 , 2024 | 01:28 AM

మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. ఇం దుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మున్సిపాలిటీల నిధులను సొంత ఖర్చు లకే వినియోగించుకునే వెసులుబాటును కూట మి ప్రభుత్వం కల్పించింది.

మున్సిపాలిటీలకు మహర్దశ

వచ్చే ఏప్రిల్‌ నుంచి నేరుగా నిధులు

బిల్లుల చెల్లింపులు కమిషనర్ల చేతికే

నిధులపై నియంత్రణ ఎత్తివేత

నిధుల దుర్వినియోగానికి ప్రభుత్వం అడ్డుకట్ట

పెద్దాపురం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. ఇం దుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మున్సిపాలిటీల నిధులను సొంత ఖర్చు లకే వినియోగించుకునే వెసులుబాటును కూట మి ప్రభుత్వం కల్పించింది. ఇకపై మున్సిపాలి టీల్లో పూర్తిస్థాయిలో వసతుల కల్పనపై దృష్టి సారించనున్నారు. ఏ మున్సిపాలిటీ నిధులను ఆ ప్రాంతంలోనే అభివృద్ధి పనులకు వినియోగించు కునేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో మున్సిపాలిటీలు మరింతగా ఆర్థిక పరిపు ష్టి సాధించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుం ది. ఇక గత ప్రభుత్వంలో మన్సిపాలిటీలు ఎదు ర్కొన్న ఆర్థిక సమస్యలకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని కనుగొంది. గత వైసీపీ ప్రభుత్వంలో అత్యవసరంగా చేసిన పనులకు బిల్లుల చెల్లింపులో జాప్యంతో మున్సిపాలిటీల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ జిల్లాలో కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని, ఏలే శ్వరం, గొల్లప్రోలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు టెండర్లు కూడా వేయలేని పరిస్థితి ఉండేది. ఆస్తి పన్ను, ఇతర పద్దుల కింద సమకూరిన సాధారణ నిధులతోనే పనులు చేయడమే మున్సిపాలిటీలు మానుకు న్నాయి. ఫలితంగా మౌలిక వసతులైన రహదా రులు, తాగునీరు, వీధిదీపాలు, పారిశుధ్యంవంటి సమస్యలతో గత ఐదేళ్లలో తీవ్ర అవస్థలను ప్రజ లు అనుభవించారు. మున్సిపాలిటీల్లో నిధులపై ప్రభుత్వ నియంత్రణ ఇక ఉండదు. సీఎఫ్‌ఎం ఎస్‌ పోర్టల్‌లో బిల్లుల అప్‌లోడ్‌ చేయడం వాటి కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. వివిధ పద్దుల కింద వచ్చే ఆదాయాన్ని అదే ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు విని యోగించుకోవచ్చు. కమిషనర్లకు బిల్లులు చెల్లిం చే అధికారం ఉంటుంది. అలాగే స్థానికంగా నిధులు దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం తగు చర్యలను తీసుకోనుంది. అలాగే అభివృద్ధి పనులపై నిరంతరం తనిఖీలు చేయనున్నారు.

నిధుల దుర్వినియోగానికి చెక్‌

మున్సిపాలిటీల్లో ఇకపై నిధుల దుర్వినియోగా నికి కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. ఆ దిశగా ప్రణాళికలను రూపొందించింది. సీఎఫ్‌ ఎంఎస్‌ ఉద్దేశానికి గత ప్రభుత్వం తూట్లు పొడి చింది. సీఎఫ్‌ఎంఎస్‌కు అనుసంధానించిన ము న్సిపాలిటీల పీడీ ఖాతాల ద్వారా క్రమపద్ధతిలో బిల్లులు చెల్లించాలన్న దానికి విరుద్ధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. రూ.కోట్ల నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. దీం తో బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉండిపోయా యి. రోజువారీ కార్యకలాపాలపైన ఇది తీవ్ర ప్రభావం చూపింది. చెత్త ట్రాక్టర్లకు డీజిల్‌ పో యించలేని దుస్థితి. ఇప్పుడు కూటమి ప్రభు త్వం నిధులపై నియంత్రణను ఎత్తివేసి బిల్లుల చెల్లింపు కమిషనర్ల చేతికే అప్పగించనుంది.

Updated Date - Dec 25 , 2024 | 01:28 AM