Share News

నన్నయలో..తినేశారు!

ABN , Publish Date - Jun 29 , 2024 | 12:57 AM

నన్నయ వర్శిటీ అవినీతి ఆరోపణలతో అప్రదిష్టపాలైంది. ఒక పక్క అధ్యాపకుల మధ్య ఆధిపత్య పోరు. మరో పక్క వీసీల ఇష్టారాజ్యంతో వర్శిటీ లో అవినీతి బండారం బయటపడుతోంది.

 నన్నయలో..తినేశారు!

ఇప్పటి వరకూ నలుగురు వీసీల బాధ్యతలు

అందరిపైనా అవినీతి ఆరోపణలు

వీసీ రాజీనామా చేయాలని గవర్నర్‌ ఆదేశం

అయినా కదలని వీసీ పద్మరాజు

రూ.7.5 కోట్ల బిల్లులు క్లియర్‌ చేసే పనిలో నిమగ్నం

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

నన్నయ వర్శిటీ అవినీతి ఆరోపణలతో అప్రదిష్టపాలైంది. ఒక పక్క అధ్యాపకుల మధ్య ఆధిపత్య పోరు. మరో పక్క వీసీల ఇష్టారాజ్యంతో వర్శిటీ లో అవినీతి బండారం బయటపడుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో వర్శిటీ పరిధిలో 200లకు పైగా కళాశాలలు ఉన్నాయి. ఈ వర్శిటీ 2006లో ఏర్పడింది. సొంత క్యాంపస్‌ ఏర్పాటుకు చాలా సమయం పట్టింది. రాజమహేంద్రవరం కేంద్రంగాదివాన్‌చెరువులో సుమారు 98 ఎకరాల్లో దీనిని నిర్మించారు. వర్శిటీ రాకముందు ఆర్ట్స్‌కాలేజీలోని కొన్ని భవనాల్లో కార్యకలాపాలు కొనసాగేవి. ఆ సమయంలో అక్రమంగా అధ్యాపకుల నియామకాలు జరగడంతో అది పెద్ద వివాదమైంది.ఆ తర్వాత జార్జి విక్టర్‌ వీసీగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో క్యాంపస్‌కు ఒక రూపు వచ్చింది. ఆయన హయాంలో ఒక వర్గం వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే ఆరోపణలున్నాయి. తర్వాత ముత్యా లనాయుడు వీసీగా ఉన్న సమయంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. నియామకాల్లో వచ్చిన ఆరోపణలపై కమిటీలు వేసి విచారణ చేపట్టారు. మధ్యలో ఇన్‌చార్జిల పాలనలో కొనసాగింది. అనంతరం పద్మరాజు వీసీగా నియమితులయ్యారు. ఆయనపైనా విమర్శలు గుప్పుమన్నాయి. పద్మరాజు వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు బంధువు. దీంతో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం మారడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్శిటీల్లో ఇప్పటి వరకూ ఉన్న వైస్‌చాన్సలర్లు అందరూ రాజీనామాలు చేయాలని గవర్నర్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది రాజీనామా చేశారు. అయితే వీసీ పద్మరాజు మాత్రం ఇంకా కుర్చీపట్టుకుని వేలాడుతున్నారు. కొత్తప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కొన్ని పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేసే పనిలో ఉన్నట్టు గుసగు సలు వినిపిస్తున్నాయి. శుక్రవారం రూ.7.5 కోట్లకు చెందిన బిల్లును క్లియర్‌ చేయమని నోట్‌ ఆర్డర్‌ పెట్టినట్టు గవర్నర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ప్రస్తుతం ఆ ఫైల్‌ ఆర్థిక శాఖ వద్ద ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా వర్శిటీలో ఆయన హయాంలో జరిగిన పలు అంశాలపై కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఏపీపీఎస్సీ సభ్యుడిగా ఉంటూ వైసీపీ ప్రభుత్వంలో తన పలుకుబడి ఉప యోగించి నన్నయ్య వీసీగా పోస్టింగ్‌ పొందినట్టు సమాచారం. యూనివర్శిటీ ఇంటర్నల్‌ ఫండ్స్‌పై వచ్చే వడ్డీని వర్శిటీ అవసరాలకు ఉపయోగించాలి. ఈ ఫండ్స్‌ బిల్డింగ్‌ కట్టడానికి అప్పటి ఉన్నత విద్యాశాఖాధికారుల నుంచి పర్మిషన్‌ తెచ్చుకున్నట్టు ఆరోపణలున్నాయి. అనర్హులైన అధ్యాపకులకు పదోన్నతులు కల్పించి రూ.లక్షల రాబట్టుకున్నట్టు సమాచారం.అమెరికాలో ఆరునెలల పాటు సెలవులో ఉన్న ఒక ప్రొఫెసర్‌కు ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం కల్పించినట్టు చెబుతున్నారు. ఇక్కడ గిరిధర్‌ అనే ఒక ఉద్యోగికి రూ.35 వేల వేతనంతో ఉద్యోగం ఇవ్వడంతో ఆందోళన కూడా జరిగింది. ప్రశ్న పత్రాలు నాణ్యత పట్టించుకోకుండా,ఆయా కళాశాలలే ప్రింట్‌ చేసుకునేలా అవకత వలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అవసరం లేకపోయినా రిటైరైన ప్రొఫెసర్లకు రూ.వేలాది జీతం ఇస్తూ వారికి కార్లు, గెస్ట్‌హౌస్‌ల వంటి సౌక ర్యాలు కల్పించినట్టు విమర్శలున్నాయి.వైసీపీ ఆడించినట్టు ఆడి.. యూనివర్శిటీ పరువు తీసినట్టు ఆరోపణలు ఉన్నాయి.ఇదిలా ఉండగా రాజీనామా చేయాలని గురువారం గవర్నర్‌ కార్యాలయం నుంచి ఆదేశించారు. అయితే ఆయన శుక్ర వారం కూడా రాజీనామా చేయలేదు.ఇక్కడే ఉండేందుకు ప్రయత్నాలు చేస్తు న్నారు. ఆయన మాట్లాడుతూ వర్శిటీని ఎంతో అభివృద్ధి చేశానన్నారు.

Updated Date - Jun 29 , 2024 | 12:57 AM