Share News

31 స్కూటీలు, బైక్‌లు సీజ్‌

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:11 AM

శాంతి భద్రతలకు భంగం కలి గించే అసాంఘిక శక్తులను ఉపేక్షించమని ఎస్పీ డి.నరసింహ కిషోర్‌ అన్నారు.

31 స్కూటీలు, బైక్‌లు సీజ్‌
అర్ధరాత్రి తనిఖీలు చేస్తున్న సిబ్బంది

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 20 (ఆం ధ్రజ్యోతి) : శాంతి భద్రతలకు భంగం కలి గించే అసాంఘిక శక్తులను ఉపేక్షించమని ఎస్పీ డి.నరసింహ కిషోర్‌ అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐల ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది, స్పెషల్‌ పార్టీ సిబ్బంది బృందాలుగా ఏర్పడి విస్తృతంగా కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. శాంతి భద్రతలకు భంగం కలి గించే అసాంఘిక శక్తులను ఉపేక్షించబోమని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అరికట్టాలంటే ప్రజలు నుంచి సహకారం ఎంతైన అవసరమని ఏదైనా సమాచారం ఉంటే దగ్గరలో ఉన్న పోలీస్‌ వారికి లేదా, 112 కి సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయన్నారు. జిల్లా వ్యా ప్తంగా వివి ధ ప్రాంతాల్లో నెంబరు ప్లేట్లు లేని ,రికార్డులు లేని 31 స్కూటీలు,బైక్‌లను పోలీసులు సీజ్‌ చేసినట్టు చెప్పారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని గుర్తించిన ప్రాంతాల్లో అణు వణువు క్షుణ్ణంగా సోదాలు చేసి సారా,అక్రమ మద్యం, మందుగుండు సామగ్రి,అనుమానితవ్యక్తుల ఆరా తీశారన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 01:11 AM