Share News

నేటి నుంచి నాటిక పోటీలు

ABN , Publish Date - Jul 11 , 2024 | 01:37 AM

అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్‌ ఆధ్వర్యంలో 40వ వార్షికోత్సవం పురస్కరించుకుని 24వ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వానపు నాటిక పోటీలు నిర్వహిస్తున్నామని సంస్థ ప్రధాన కార్యదర్శి పంపన దయానందబాబు తెలిపారు.

నేటి నుంచి నాటిక పోటీలు

పోర్టుసిటీ(కాకినాడ), జూలై 10: అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్‌ ఆధ్వర్యంలో 40వ వార్షికోత్సవం పురస్కరించుకుని 24వ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వానపు నాటిక పోటీలు నిర్వహిస్తున్నామని సంస్థ ప్రధాన కార్యదర్శి పంపన దయానందబాబు తెలిపారు. కాకినాడ సినిమారోడ్‌లోని సూర్యకళామందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నాటిక పోటీలు జరుగుతాయన్నారు. గురువారం ఉదయం 9 గంటలకు తెలుగు వీర లేవరా-దీక్షబూని సాగరా పేరుతో సినీ సంగీత స్వరాభిషేకం నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభ సభ జరుగుతుందన్నారు. సభలో ముఖ్య అతిథిగా కాకినాడ నగర శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు), విశిష్ట అతిథిగా ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ పాల్గొంటారని తెలిపారు. రాత్రి 7 గంటలకు మలి సంధ్య, అనంతరం ఆ సరసాల నాటిక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. 13వ తేదీన ఆంధ్రశ్రీ అవార్డును ప్రముఖ పారిశ్రామికవేత్త సలాది వీర వెంకట సత్యనారాయణమూర్తికి, 14న అల్లూరి సీతారామరాజు విశిష్ట సాంస్కృతిక సేవా పురస్కారాన్ని శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపకులు గుంటూరి తణుకులు(శ్యామ్‌)కు అందజేస్తామని వివరించారు. అనంతరం నాటిక పోటీల ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు. పరిషత్‌ ఉపాధ్యక్షులు బాపిరాజు, కిర్ల పుల్లారావు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2024 | 01:37 AM