Share News

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

ABN , Publish Date - Jun 06 , 2024 | 01:50 AM

పర్యావ రణ పరిరక్షణ అందరి బాధ్యతని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్క రించుకొని జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పీడీజే గంధం సునీత

రాజమహేంద్రవరం, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): పర్యావ రణ పరిరక్షణ అందరి బాధ్యతని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్క రించుకొని జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరు మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించాలన్నారు. పర్యావరణానికి హాని కలిగిస్తే భవిష్యత్తు తరాల మను గడ ప్రమాదంలో పడుతుందన్నారు. కార్యక్రమంలో శాశ్వ త లోక్‌ అదాలత్‌ చైర్‌పర్సన్‌ ఎ.గాయత్రి దేవి, ప్రిన్సిపల్‌ అండ్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.శ్రీలక్ష్మీ, ఎంసీపీసీ సీనియర్‌ ట్రైనర్స్‌ వినయ్‌కుమార్‌ గుప్తా, సునీల్‌ కుమార్‌ అగర్వాల్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టి.వీరేంద్రనా థ్‌, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.

గోదావరి కలుషిత నియంత్రణ అందరి భాధ్యత

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 5: రాజమహేంద్రవరం కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాద్యత అందరిపైన ఉందని గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీ కే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సమితి ఆధ్యంలో గోదావరి పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్బంగా నావలో గోదావరి పైకి వెళ్లి నదిలో ఉన్న చెత్తా, చెదారాలు, నాచును తొలగించారు. నది కలుషితం కాకుండా ఉండాలనే ఆలోచనతో తాము పనిచేస్తున్నామని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రుడా చైర్మన్‌ రౌతు సూర్యప్రకాశరావుతో కలిసి నదిలో నాచును తొలగించారు. సమితి సభ్యులు చుండ్రు వీరభద్రరావు, ఎన్‌.అప్పారావు, ఎస్‌వీవీ రెడ్డి, బి. అప్పారావు, సురేష్‌, శ్రీను పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలి

రాజమహేంద్రవరం కల్చరల్‌ జూన్‌ 5: పర్యావరణ పరిరక్షణలో అంద రూ భాగస్వాములు కావాలని అంత ర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా మేనేజ్‌ మెంట్‌ కమిటీ సభ్యులు గొట్టిముక్కల అనంతరావు పిలుపు నిచ్చారు. బుధవారం రాజమహేంద్రవరం టి.నగర్‌లోని రెడ్‌ క్రాస్‌ కార్యాలయంలో మాట్లాడుతూ, పర్యావరణను రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిఽథిగా విచ్చేసిన గొట్టి ముక్కల అనంతరావు రెడ్‌క్రాస్‌ భవనం ప్రాంగణంలో అనేకరకాల మొక్కలు నాటారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఎంసీ మెంబరు జిన్విబి మహలక్ష్మి, రాజ మండ్రి బార్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ ధర్నాలకోట వెంకటేశ్వర రావు, రెడ్‌క్రాస్‌ లైఫ్‌ మెంబర్‌ సుధాకర్‌, సిబ్బంది పద్మ,పాల్గొన్నారు.

కాలుష్య రహిత వాహనాలను వినియోగించాలి

రాజానగరం, జూన్‌ 4 : కాలుష్య నివారణలో భాగంగా సాంప్రదాయ వనరుల నుంచి విద్యుత్‌, సౌరశక్తితో నడిచే వాహనాలను వినియోగిం చాలని అనపర్తి అగ్నిమాపక కార్యాలయం అధికారి శ్రీనివాసరెడ్డి పిలుపుని చ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండలంలోని చక్రద్వారబంధంలో గైట్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వ ర్యంలో గ్రామంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వివిధ రకాలు మొక్కలు నాటారు. విరాట్‌ ఆర్గానిక్‌ ఫాం నిర్వాహకుడు రెడ్డి నాయుడు జీవామృత తయారీ విధానం, ఉపయోగాలు గురించి వివరించారు. కళాశాల పీవో షేక్‌ మీరా, గ్రామస్థులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత

రాజమహేంద్రవరం కల్చరల్‌ జూన్‌ 5: అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక వెంకటేశ్వర నగర్‌ లోని జవహర్‌ వాకర్స్‌ క్లబ్‌ మెంబర్లు పర్యావరణ పరిరక్షణకు విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్‌ జీవీఎస్‌ నాగేశ్వరరావుకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅ తిఽఽథులుగా విచ్చేసిన డాక్టర్‌ కర్రి రామారెడ్డి, డాక్టర్‌ గోలి రామారావు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ పట్నాయక్‌ మాట్లాడారు.

దినారాయణ, నాగదేవి

Updated Date - Jun 06 , 2024 | 08:28 AM