కొత్త బంగారు లోకం.. ఏంటంటే
ABN , Publish Date - Sep 29 , 2024 | 01:22 AM
కొత్తబంగారు లోకం.. మీకు అవుతుంది సొంతం.. బంగారం కొనుగోలు చేయలేకపోతున్నామనే బాధెందుకు.. ప్రత్యామ్నాయం వచ్చేసిందండోయ్.. 24 క్యారెట్.. 22 క్యారెట్ బంగారు వస్తువులనే కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.. అచ్చంగా బంగారంలా కనిపించే వెండిపై గోల్డ్ కోటెడ్ ఆభరణాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.. అదీ కొనలేరా.. ఇమిటేషన్ జ్యూయలరీ ఉండనే ఉందిగా.. మన బడ్జెట్ మేరకు అందమైన వస్తువులను తీసుకోవచ్చు.. అలంకరించుకోవచ్చు.. మనసును కుదుటపరచవచ్చు.. అదీ కాదంటారా.. ఒక ఏడాది ఆగారంటే.. ఏకంగా తులం రూ.20 వేలకే అచ్చంగా స్వచ్ఛమైన బంగారం కొనేయ వచ్చు.. అదెలాగంటారా..
మెరిసేదంతా బంగారం కాదండోయ్..
బంగారం ధర దూకుడు
రోజురోజుకు పెరుగుదల
పడిపోయిన అమ్మకాలు
ఉమ్మడి తూర్పున 1,200 దుకాణాలు
50కిపైగా కార్పొరేట్ బ్రాంచ్‌లు
నాడు రోజుకు రూ.40 కోట్ల విక్రయాలు
ఇప్పుడు రూ.22 కోట్లే
త్వరలో కేంద్రం 9 క్యారెట్ ఆభరణాలు
తులం రూ.20వేలకే బంగారం
సామాన్యుల్లో కొంగొత్త ఆశలు
బంగారం కోటెడ్ సిల్వర్ ఆభరణాలకు క్రేజ్
ఇమిటేషన్ జ్యూయలరీకి డిమాండ్
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)/(రాజమహేంద్రవరం,ఆంధ్రజ్యోతి)
కొత్తబంగారు లోకం.. మీకు అవుతుంది సొంతం.. బంగారం కొనుగోలు చేయలేకపోతున్నామనే బాధెందుకు.. ప్రత్యామ్నాయం వచ్చేసిందండోయ్.. 24 క్యారెట్.. 22 క్యారెట్ బంగారు వస్తువులనే కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.. అచ్చంగా బంగారంలా కనిపించే వెండిపై గోల్డ్ కోటెడ్ ఆభరణాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.. అదీ కొనలేరా.. ఇమిటేషన్ జ్యూయలరీ ఉండనే ఉందిగా.. మన బడ్జెట్ మేరకు అందమైన వస్తువులను తీసుకోవచ్చు.. అలంకరించుకోవచ్చు.. మనసును కుదుటపరచవచ్చు.. అదీ కాదంటారా.. ఒక ఏడాది ఆగారంటే.. ఏకంగా తులం రూ.20 వేలకే అచ్చంగా స్వచ్ఛమైన బంగారం కొనేయ వచ్చు.. అదెలాగంటారా.. సామాన్యులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం 9 క్యారెట్ గోల్డ్ అందుబాటులోకి తీసుకురానుంది.. ధర తులం రూ.20 వేల ఉండొచ్చని అంచనా.. ఇంకెం దుకు ఆలస్యం ఏ బంగారం కొంటారో ఆలోచించుకోండి మరి!
బంగారంపై ఆకర్షణ
ఎంత కొన్నా ఇంకా ఇంకా కొనాలనిపించేది బంగారం.. మోజు తగ్గదు.. ఆకర్షణ ఆగ దు.. ఆ మెరుపునకు చిక్కితే ఇక అంతే. ఎంతున్నా ఇంకా ఇంకా కావాలని పిస్తూనే ఉం టుంది..మహిళలకైతే పసిడి అంటే మహాపిచ్చి. ధనవంతు లకైతే ఇదో స్టేటస్ సింబల్.. పేదోళ్లకు అత్యవస రానికి ఆదుకునే వస్తువు..ఒక రకం గా చెప్పాలంటే పసిడి సుర క్షిత పెట్టుబడి సాధనం.. ఇం ట్లో ఆడపిల్ల ఉన్న తల్లిదం డ్రులైతే పిల్ల పెళ్లికి బంగారం కోసం ఎన్నో ఆశలు పెట్టుకుం టారు..ముందునుంచే కొంచె కొంచెం కొని కూడబెడతారు. ఇప్పుడా పసిడి పట్టపగ్గాల్లే కుండా పరుగెడుతోంది. రెండు నెల ల కిందట తగ్గినట్లే తగ్గి ఇప్పుడు ఆల్‌టైం హై రేటుకు ఎగబా కింది.దీంతో జిల్లాలో పసిడి అమ్మకాలు గణనీయంగా తగ్గిపో యాయి.ఈ తరుణం లో కేంద్రం కొత్తగా తేవాలనుకుంటోన్న 9 క్యారెట్ గోల్డ్‌పై సామాన్యులు ఆశలు పెంచుకున్నారు. మరి కొందరు పసిడి ప్రియులైతే పెరిగిన ధరలు భరించ లేక గోల్డ్ కోటెడ్ ఉన్న సిల్వర్ ఆభరణాలు కొంటున్నారు.అసలు బంగారు ఆభరణాలకంటే రెట్టింపు డిజైన్లు దొరుకుతున్నాయి. దీంతో వీటిని కొంటుండడంతో ఈ వ్యాపారం జోరందుకుంది.
తగ్గి పెరిగిన ధర..
కేంద్రప్రభుత్వం జూలైలో పసిడిపై కస్టమ్స్ ట్యాక్స్ తగ్గించ డంతో ధరలు ఒక్కసారిగా తగ్గాయి. గ్రాము రూ.6,900 నుంచి క్రమేపీ రూ.6,300 వరకు పడిపోయింది.దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరిగాయి. ఒక్క వారంలో కొనుగోళ్లు రూ.550కోట్ల వరకు జరిగాయి. బం గారం కొనుగోళ్లకు సంబంధించి వార్షిక ఫిక్సిడ్ డిపాజిట్లు ఏకంగా రూ.800కోట్ల వరకు వెళ్లాయి. అయితే గత నెలరో జులుగా బంగారం పరుగు పెడుతూనే ఉంది. రెండు రోజుల కిందట శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.7,100 వరకు ఎగబాకింది. అటు ఆల్‌టైం గరిష్ఠానికి ధరలు పెరగ డంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొను గోళ్లు సగానికి సగం పడిపోయాయి.
సగానికి పడిపోయిన అమ్మకాలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 1,200 వరకు బంగారు ఆభరణాల విక్రయ దుకాణాలున్నాయి. ఇందులో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, మండపేట, పెద్దాపురం పట్టణాల్లో అధికంగా ఉన్నాయి. వీటన్నింటిలో రోజుకు ధరలు తగ్గిన సమయంలో రూ.40 కోట్ల వరకు అమ్మకాలు జరిగేవి. సగటున ఒక్కో దుకాణం రోజుకు 225 గ్రాముల వరకు విక్రయించేవి. ఇప్పుడు రోజువారీ విక్రయాలు రూ.22 కోట్లకు పడిపోయాయి. ఉమ్మడి జిల్లాలో కార్పొరేట్ బంగారం దుకాణాలు అన్ని బ్రాంచ్‌లు కలిపి 50 వరకు ఉన్నాయి. వీటిలో సీజన్ సమయంలో రోజుకు రూ.55 కోట్ల వరకు విక్రయాలు జరిగేవి. ఇప్పుడు ధరాభారంతో రూ.33 కోట్ల వరకు జరుగుతున్నట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పసిడి వర్తక సంఘం విశ్లేషించింది.
సామాన్యుడికి బంగారం లాంటి కబురు..
కపక్క బంగారం ధరలు భారీగా పెరిగి పోతూ సామాన్యుడు కొనుగోలు చేసే పరిస్థితి లేక పోయింది. మరోపక్క బంగారం విలువ అధికంగా ఉండడంతో వీటిని ధరించే మహిళలపై రోజు రోజుకు నేరాలు పెరిగి పోతున్నాయి.ఒంటిపై ఉన్న ఆభరణాలు తస్కరించడం, కొన్నిసార్లు చంపేసి లాక్కుపోతున్న పరిస్థితులు పెరిగి పోతుండడంతో కొత్తగా 9 క్యారెట్ బంగారు ఆభరణా లను దించాలని కేంద్రం ఆలోచి స్తోంది. ఇది వచ్చే ఏడాదిలోగా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.వాస్తవానికి ఇప్పుడు ప్రతిఒక్కరూ 22 క్యారెట్ విభాగం లో 916 హాల్ మార్క్ ఆభరణాలే వినియోగిస్తున్నారు. ఇందు లో 91.67 శాతం బంగారం ప్యూరిటీ ఉంటుంది. 8.33 శాతం కాపర్, సిల్వర్ కలుపుతారు. 22 క్యారెట్ల బంగారం గ్రాము ప్రస్తుతం రూ.7,100కు ఎగబాకి కొనలేని పరిస్థితులు తలెత్తా యి.దీంతో కొత్తగా 9 క్యారెట్‌తో బంగారు ఆభరణాలను కేం ద్రం దించబోతోంది.ఇందులో బంగారం కేవలం 37.5 శాతమే ఉంటుంది. 42.5 శాతం సిల్వర్, 20 శాతం కాపర్ ఉంటుంది. ఇతర లోహాలు ఎక్కువ మోతాదులో కలపడం వల్ల 9 క్యారె ట్ బంగారం ధర తులం రూ.20 వేలకే వచ్చేయనుంది. అంటే 22 క్యారెట్ అయితే తులం రూ.71 వేలు ఉంది. తద్వా రా 9 క్యారెట్ బంగారానికి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. 9 క్యారెట్‌లో పసిడి తక్కువగా కలుస్తుంది కాబట్టి అంతగా ఆకర్షణీయంగా కనిపించక పోవచ్చనే వాదన ఉంది. మరోపక్క చాలా మంది బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తారు కాబట్టి దీనిపై ఎంతవరకు మొగ్గుచూపుతారనేది చూడాలి.
‘తరుగ’ని దోపిడీ.. మజూరీతో బేజారు
బంగారం వస్తువులు, ఆభరణాల కొనుగోలులో కాస్త మాయ ఉంటుంది. తరుగు, మజూరీలో కొందరు వర్తకులు ఎంతో కొంత బురిడీ కొట్టిస్తుంటారు.నగిషీలు ఎక్కువగా కావాలంటే తరుగు కూడా ఆ పరిమాణంలోనే ఉంటుంది. ఇవాళ 5 నుంచి 25శాతం వరకూ కూడా తరుగు వేస్తున్నారు. జిగేల్‌మనే పగడాలతో, కళ్లు మిరుమిట్లు గొలిపే రాళ్లతో, ఆకట్టుకునే రంగులతో ఉన్న వస్తువుల్లో బంగారం ఎంత ఉందో చెప్పడం కష్టం. ఇదే అదనుగా వీటిలో భారీ దోపిడీ జరుగుతోంది. ఎక్కువగా బరువు ఉండే రాళ్లు, ముత్యా లు వంటి వాటిని వాడి కొందరు వ్యాపారులు దోచేస్తున్నారు.
అచ్చంగా బంగారమే..
ఒకపక్క పసిడి కొనలేనంతగా పెరగడంతో ఉమ్మడి జిల్లాలో మహిళలు వన్ గ్రాం గోల్డ్‌తో తయారు చేసిన ఇమిటేషన్ ఆభరణాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. రోజువారీగా ధరించడానికి నల్లపూసలు, గాజులు తదితర వన్ గ్రాం ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వస్తువులకు మహా డిమాండ్ ఉంది. ప్రస్తతం ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక వన్‌గ్రాం గోల్డ్ షోరూమ్‌లు వెలుస్తున్నా యంటే ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. చివరకు పెళ్లిళ్లు, పుట్టినరోజుల వేడుకల్లోను బహుమతుల కింద ఈ ఆభరణాలే ఇస్తున్నారు.
సిల్వర్‌తో ధగధగలు..
గోల్డ్ కోటింగ్‌తో కూడిన సిల్వర్ ఆభరణాలు ఈ మధ్య మార్కెట్లో భారీగా దొరుకుతున్నాయి. గోల్డ్ కోటింగ్‌లా అసలే మాత్రం కనిపించకుండా అచ్చంగా బంగారు ఆభరణాల్లాగే ఉంటున్నాయి. గాజులు, నెక్లెస్, వడ్డాణం, చెవి రింగులు ఒక టేంటి అసలు బంగారు ఆభరణాల కంటే వీటిలోనే వందల కొద్దీ మోడళ్లు లభ్యమవుతున్నాయి. ధరిస్తే అసలు బంగారం లాగే ఇవి నిగనిగలాడుతాయి. పైగా వీటిని కొనుగోలు చేస్తే ఏడాది లేదా ఒక నెలలోనే తిరిగి అదే దుకాణానికి ఇచ్చేస్తే కొనుగోలు ధరలో 55 శాతం బైబ్యాక్ ఆభరణాల రూపంలో ఇస్తున్నారు. అనేక దుకాణాల్లో ఇదే విధానం అమలవుతోంది. దీంతో నచ్చిన ఆభరణాలను మహిళలు కొనుగోలు చేసి తిరిగి కొద్దినెలలకే అవి వెనక్కు ఇచ్చి కొత్తవి తీసుకుంటున్నారు. తద్వారా పసిడి ధరల పెరుగుదల భారం నుంచి బయట పడుతున్నారు. కాకినాడలో త్వరలో గోల్డ్‌కోటెడ్ సిల్వర్ ఆభరణాలు విక్రయించడానికి ఓ కార్పొరేట్ కంపెనీ షోరూం కూడా ప్రారంభించబోతోంది. 22 క్యారెట్ ఆభరణాల దగ్గర నుంచి వన్‌గ్రాం గోల్డ్, గోల్డ్‌కోటెడ్ సిల్వర్ ఆభరణాలు సైతం భారీగా ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నాయి. అనేక మంది మహిళలు ఆన్‌లైన్ ఆర్డర్ ద్వారా రప్పిస్తున్నారు. ఈ మార్కెట్ జిల్లాలో రూ.25కోట్ల వరకు ఉంటుందని అంచనా.
బంగారం ఎలా వస్తుందో తెలుసా..?
ఆభరణాల తయారీకి బంగారం ఎక్కడినుంచి వస్తోందా తెలుసా? ప్రముఖ కార్పొరేట్ కంపెనీలైనా, చిన్న దుకాణాలైనా కచ్చితంగా బంగారం బిస్కెట్ కొని వీటి నుంచి ఆభరణాలు తయారు చేస్తాయి. నేరుగా విదేశాల నుంచి ఈ బిస్కెట్లు తేవడానికి లేదు. బ్యాంకుల ద్వారా మాత్రమే బిస్కెట్లు, కడ్డీలు కొనుగోలు చేయాలి. జిల్లాలో అనేక కంపెనీలు బ్యాంకుల నుంచి అరకిలో, కిలో 24 క్యారెట్ బిస్కె ట్లు కొంటాయి.కేంద్రప్రభుత్వ పరిధిలోని ఎంఎంటీసీ అనే సంస్థ నేరుగా విదేశాల నుంచి బంగారం బిస్కెట్లు, నాణేలు కొని బయట విక్రయిస్తుంది. ఎంఎంటీసీ నుంచి ఎవరైనా వీటిని కొనుగోలు చేసుకోవచ్చు.
బంగారం మెత్తగా ఉండి బాగా సాగే గుణం కలిగి ఉంటుంది.వెంట్రుక కంటే సన్నగా సాగదీసినా గట్టిద నం తగ్గదు.ఒక ఔన్సు బంగారాన్ని 300 చదరపు అడుగుల రేకుగా సాగదీయవచ్చు. ఒక గ్రాము బం గారాన్ని ఒక చదరపు మీటరు వైశాల్యం కలిగిన రేకుగా లేదా 20 మైక్రో మీటర్ల మందం ఉన్న 165 మీటర్ల పొడవాటి తీగలా చేయవచ్చు.
బంగారాన్ని నాణేలు, వస్తువులు, ఆభరణాలు తయా రు చేయడం దగ్గర నుంచీ వాడకం విపరీతంగా పెరి గింది. 1930 నుంచి నాణేల చలామణీని ఆపేశారు.
2012 నాటికి ప్రపంచంలో 2లక్షల టన్నుల బంగారం ఉత్పత్తి జరిగింది.
బంగారం స్వచ్ఛతను ఫెన్నీస్ లేదా క్యారెట్లలో కొలు స్తారు.బరువును ట్రాయ్ ఔన్సుల్లో లెక్కిస్తారు.ఒక ట్రాయ్ ఔన్సు అంటే మన పరిభాషలో కిలోన్నర బంగారం.
బంగారపు దారాలను దుస్తుల ఎంబ్రాయిడరీకి విని యోగిస్తారు.టీవీలు,కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు వంటి ఎలకా్ట్రనిక్ వస్తువుల్లో స్వల్పంగా బంగారాన్ని ఉపయో గించవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది.
బంగారంలో 24 క్యారెట్స్ ప్యూరిటీ కాగా ఆభరణాల తయారీలో 22 క్యారెట్స్ వినియోగిస్తారు. ఏ అభరణ మైనా 22 క్యారెట్ ప్యూరిటీ గోల్డ్‌తో మాత్రమే తయా రు చేస్తారు. 18 క్యారెట్ బంగారం కూడా ఉంది. డైమండ్స్ తయారీలో ఈ బంగారాన్ని ఉపయోగి స్తారు. త్వరలో 9 క్యారెట్ బంగారం అందుబాటులోకి రానుంది.అదే వస్తే ధరలు తగ్గుతాయి.