Share News

ఊపిరిని పట్టే న్యూమోనియా

ABN , Publish Date - Nov 12 , 2024 | 01:04 AM

న్యుమోని యా.. ఊపిరితిత్తుల్లో వచ్చే ఒక ఇన్‌ఫెక్షన్‌. దగ్గినప్పుడు, వైరస్‌ల ద్వారాను, బాక్టీరియా ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది.

ఊపిరిని పట్టే న్యూమోనియా

జీజీహెచ్‌(కాకినాడ)/రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి) : న్యుమోని యా.. ఊపిరితిత్తుల్లో వచ్చే ఒక ఇన్‌ఫెక్షన్‌. దగ్గినప్పుడు, వైరస్‌ల ద్వారాను, బాక్టీరియా ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. తుమ్మినప్పుడు, దగ్గినపుడు ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. సాధారణ భాషలో న్యుమోనియాను నెమ్ముగా వ్యవహరిస్తుంటారు.ఇది వచ్చిన రోగికి దగ్గు, కఫ ం, జ్వరం, ఆయాసం వంటివి వస్తుంటాయి. వివిధ రకాలైన పరీక్షల ద్వారా దీన్ని గుర్తించవచ్చు.నాన్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా ఇది రావొచ్చు. కొన్ని రకాల పడని వస్తువులు తిన్నా, పడని వాతావరణంలోకి వెళ్లినా ఇది వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మంగళవారం ప్రపంచ న్యూమోనియా డే సందర్భంగా ప్రత్యేక కథనం..

చలికాలంలో వైరల్‌ న్యుమోనియా

చలికాలంలో వైరల్‌ న్యుమోనియాలు ఎక్కువగా వస్తాయి. సీజన్‌ ఆరంభం నుంచీ వీటి ప్రభావం కనిపిస్తుంది. బాక్టీరియల్‌ న్యుమోనియాలు ఎప్పుడైనా రావచ్చు. వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండేవారికి ఎక్కువగా వస్తాయి. రెండేళ్ల చిన్నారులకు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా స్మోకింగ్‌ చేసేవారికి, రీనల్‌ ఫెయిల్యూర్‌ పేషెంట్‌, హెచ్‌ ఐవీ, దీర్ఘకాలిక వ్యాధులకు స్టెరాయిడ్స్‌ వాడుతున్నవారికి కూడా రావొచ్చు. వీరితోపాటు కేన్సర్‌ పేషెంట్లు, ఊపిరితిత్తుల వ్యాధులున్నవారికి, నియంత్రణలేని డయాబెటిస్‌ రోగులకు న్యుమో నియాలు ఎక్కువగా వస్తుంటాయి.

కొవిడ్‌ జాగ్రత్తలే...

ఏ రకం నిమోనియాకు అయినా కొవిడ్‌ జాగ్రత్తలే తీసుకోవాలి. మాస్కు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేయడం, తరచూ చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటివి చేయాలి. తుంపర్లు ద్వారా ఇతరులకు త్వరగా వ్యాపించే అవకాశం ఉన్నందున మాస్కు ధరించడం శ్రేయస్కరం అని వైద్యులు చెబుతున్నారు.

ఈ లక్షణాలుంటే జాగ్రత్త

మనిషి రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి పడిపోతే వెం టిలేటర్‌ వరకు వెళ్లే స్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కఫం బాగా పడుతున్నా,చలికి బాగా వణుకుతున్నా, బాగా ఆయా సపడుతున్నా, దేహంలో ఎటువంటి తేడాలు కనిపించినా, వెంటనే పల్స్‌ ఆక్సీమీటర్‌పై పరీక్షించుకుని శాచురేషన్‌ 85 కంటే తక్కువుగా ఉంటే వెం టనే వైద్యుడిని సంప్రదించాలి. అక్కడ చికిత్స ద్వారా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

గుర్తించడం ఎలా...

వైరల్‌ న్యూమోనియా సోకినపుడు ఎక్స్‌రేలో చిన్న చిన్న మచ్చలుగా కనిపిస్తాయి. ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా మంది సరిగా గుర్తించలేరు. అప్పుడు సీటీ స్కాన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా పెద్ద మచ్చలా కనిపిస్తే దాన్ని బాక్టీరియల్‌ న్యుమోనియాగా గుర్తిస్తారు. వైరస్‌, బాక్టీరియా తేలిన తర్వాత దానికి అనుగుణంగా మెడిసిన్‌ ఇస్తారు.

కాలుష్యం.. కోనోకార్పస్‌ చెట్లూ

ఉమ్మడి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్ర వరం నగరాల్లో వాహనాల సంఖ్య ఎక్కువ. ఈ నగరాలకు దగ్గర్లో పరిశ్రమలు ఉన్నాయి. వాహనా లతో పాటు ఫ్యాక్టరీల నుంచి వచ్చే వాయు కాలుష్యంతో నిండిన గాలి పీల్చినవారికి న్యుమోనియా సంక్రమించే అవకాశాలున్నాయి. అందు వల్ల వ్యాధినిరోధకశక్తి తక్కువ ఉన్న వారు మాస్క్‌ ధరించడం ఉత్తమం. అలంకారం కోసం, నీడ కోసం రోడ్లకు ఇరువైపులా నాటిన కోనోకార్పస్‌ చెట్లు పెద్ద నగరాలు, మునిసి పాలిటీల్లో ఎక్కువ. ఈ చెట్ల వల్ల..వాటి పూల పిప్పొడి మనిషి ఊపి రితిత్తుల్లోకి వెళ్లి ఇన్‌ఫెక్షన్‌ చేరి న్యూమోనియాకు దారితీసే అవకాశాలున్నాయి.కొన్ని కెమికల్స్‌, రేడియేషన్‌ వల్ల కూడా న్యుమోనియా రావచ్చు.ఇన్‌ఫెక్షన్ల వల్ల కాకుండా నాన్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల వస్తుంటాయి.

ముందే మేల్కొంటే మంచిది..

సకాలంలో చికిత్స చేయించుకుంటే న్యుమోని యా పెద్ద జబ్బేమీ కాదు. కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం మరణానికి చేరువై భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. న్యుమోనియా ఊపిరితి త్తుల్లో ఏర్పడుతుంది.ఈ వైరస్‌ ఒకేసారి చుట్టుముట్టి ఎక్కువ మందిని ప్రభావితం చే సి మరణం వరకు తీసుకెళ్తుంది.ఈ తరహాలో 2000లో బర్డ్‌ఫ్లూ, 2009లో స్వైన్‌ఫ్లూ, 2018లో నిఫా వైరస్‌, 2020లో కొవిడ్‌ వచ్చి ప్రాణాంతకంగా మారి ఎంతో మంది మరణానికి కారణమయ్యాయి.ఇవన్నీ వైరల్‌ న్యు మోనియా జ్వరాలే.ఇవి కాకుండా సాఽధారణంగా వ్యాప్తి చెందేవి బ్యాక్టీరియల్‌ న్యుమోనియా జ్వరా లు.ఇవి వ్యాధినిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో కనబడతాయి.

సకాలంలో వైద్యమే మందు

సకాలంలో న్యుమోనియాకు వైద్యం చేయించుకోకపోతే లోపల ఉన్న ఇన్‌ఫెక్షన్‌ వల్ల రసిపట్టడం.. ఛాతీలోకి రసి చేరడం, ఒక్కోసారి క్రిములు దేహమంతా వ్యాపిస్తాయి. న్యు మోనియా బాగా ముదిరితే అది రక్తంలోకి చేరుతుంది. దీన్ని సెప్టిసేమియా అంటారు. రక్తంలో నుంచి శరీర ప్రధాన అవయవాలైన కిడ్నీ, లివర్‌, గుండె, బ్రెయిన్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో మల్టీ ఆర్గాన్స్‌ ఫెయిలై కోమా లేదా ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయి. మల్టీ ఆర్గాన్స్‌కు వెళితే యాంటీ బయాటిక్స్‌ ఇవ్వడం ద్వారా నయం చేసే అవకాశంఉంది.వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉంటే ఆగస్టులో ఇన్‌ఫ్లూ యేంజా వ్యాక్సి న్‌ లేదా న్యూమోకోకిల్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి.

Updated Date - Nov 12 , 2024 | 01:04 AM