యుగ పురుషుడు ఎన్‌టీఆర్
ABN , Publish Date - Dec 23 , 2024 | 12:53 AM
యుగ పురుషుడు దివంగత ఎన్‌టీఆర్ అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, సీఎం ప్రోగ్రాం కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అన్నారు.
మండపేట, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): యుగ పురుషుడు దివంగత ఎన్‌టీఆర్ అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, సీఎం ప్రోగ్రాం కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అన్నారు. మండపేట మండలం తాపే శ్వరం సెంటరులో ఏర్పాటు చేసిన ఎన్‌టీఆర్ విగ్రహాన్ని శనివారం వారు అవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్‌టీఆర్ చిత్రపరిశ్రమతోపాటు రాజకీయ రంగంలో తన దైన ముద్ర వేసుకున్నారని అన్నారు. తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ఘనత కూడా ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. గ్రామంలో ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసిన పార్టీ శ్రేణులను వారు అభినందించారు. కార్యక్రమం లో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రెడ్డిప్రసాద్, మాజీ ఎంపీపీలు గోసాల సుజాత, తాపేశ్వరం గ్రామ సర్పంచ్ వాసంశెట్టి రాజేశ్వరి, అర్తమూరు ఉప సర్పంచ్ కర్రి సత్యనారాయణరెడ్డి, పితాని వేంక టేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు ఎన్.వీర్రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు యరగతపు బాబ్జి, టీడీపీ నేతలు నూని వీర్రాజు, మత్యాల సత్యనారాయణ, పట్టాభి తదితరులతో పాటు, పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.