Share News

అక్టోబరు 3 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , Publish Date - Sep 30 , 2024 | 12:10 AM

మండలంలోని చక్రద్వారబం ధంలో 32వ వార్షిక దేవి నవరాత్రులను అక్టోబరు 3వ తేదీ నుంచి ఘనంగా నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పో స్టర్‌ను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తన నివాసంలో ఆదివారం ఆవిష్కరిం చారు.

అక్టోబరు 3 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
దేవీ నవరాత్రుల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం/దివాన్‌చెరువు, అక్టోబరు 29: మండలంలోని చక్రద్వారబం ధంలో 32వ వార్షిక దేవి నవరాత్రులను అక్టోబరు 3వ తేదీ నుంచి ఘనంగా నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పో స్టర్‌ను ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తన నివాసంలో ఆదివారం ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15వ తేదీ వరకు జరిగే ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆఖరి రోజు తీర్థం జరుగుతుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అలాగే దివాన్‌చెరువులోని ఆగమాశమ్రంలో వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద శ్రీరాజ్యలక్ష్మిదేవి సన్నిధిలోను, స్థానిక రాంబాబు డాక్టరు గృహావరణలోని శ్రీవిశ్వేశ్వరమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఆలయార్చకుడు పవనాచార్యులు, డాక్టర్‌ కేవీఆర్‌ సుబ్రహ్మణ్యం దంపతులు తెలిపారు. ఈ ఉత్సవాలు 12వ తేదీ వరకూ జరుగుతాయని, అమ్మవారు రోజుకొక అలంకారంలో దర్శనమిస్తారని చెప్పారు. 9న సరస్వతీదేవికి పూజలు జరుగుతాయని చెప్పారు.

  • రాజరాజేశ్వరి దేవీ నవరాత్రుల పోస్టర్‌ ఆవిష్కరణ

కోరుకొండ, సెప్టెంబరు 29: కోరుకొండలోని కాపవరం సెంటర్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి 34వ వార్షిక దేవీ నవరాత్రుల పోస్టర్‌ను ఆదివారం కోరుకొండలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆవిష్కరించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ వచ్చే నెల 3 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 10రోజుల పాటు జరుగుతాయని చెప్పారు. 9న 108 మంది దంపతులతో సామూహిక సహస్ర కుంకుమార్చన, 13న అమ్మవారి గ్రామోత్సవం, 17న అన్నసమారాధన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అనువంశక ధర్మకర్త నీరుకొండ బాబ్జి, కట్ట సత్తిబాబు, మల్లేసు, జనసేన నాయకుడు బదిరెడ్డి దొర, ఎస్‌ఎంసీ చైర్మన్‌ తెలగంశెట్టి శివ పాఆల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2024 | 12:10 AM