విద్యుత్‌ను పొదుపు చేద్దాం
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:24 AM
విద్యుత్‌ను వృఽథా చేయవద్దు.. ఆదా చేద్దామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా టోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
రాజమహేంద్రవరం, డిసెంబరు 14 (ఆంధ్ర జ్యోతి) : విద్యుత్‌ను వృఽథా చేయవద్దు.. ఆదా చేద్దామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా టోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక వై.జంక్షన్‌లో శనివారం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారో త్సవాలను ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 20వ తేదీ వరకూ వారోత్సవాలు జరుగుతాయ న్నారు. మనం విద్యుత్‌ను వృఽథా చేస్తే భవిష్యత్త రాలకు అంధకారాన్ని మిగిల్చిన వారవుతామ న్నారు.ఇంధన ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపుపై అవగాహన అవసరమన్నారు.సంప్రదాయ బల్బుల స్థానంలో ఎల్‌ఈడీ వాడకం ద్వారా 60శాతానికి పైగా విద్యుత్ ఆదా చేయవచ్చని పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు వల్ల డబ్బు ఆదా చేసుకోవచ్చ న్నారు. ఎలక్ర్టిసిటీ, బొగ్గు, డీజిల్, పెట్రోలు విషయంలో ప్రత్యామ్నాయం ఆలోచించాలని సూచించారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ ఇంధన పొదుపు మీద ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేయడం వల్ల రెండు యూనిట్లు ఉత్పత్తి భారం తగ్గుతుందని చెప్పారు. వ్యవసాయం, గృహావసరాలకు సంబంధించి సోలార్ విధా నాన్ని వినియోగంలోకి తెచ్చే విధంగా ప్రమోట్ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ అవసరం లేని సమయంలో స్విచ్చాఫ్ చేయాలని సూచిం చారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ భావితరాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదా చేయడానికి పునాదులు వేద్దామన్నారు.నేటి సంకల్పం రేపటి వెలుగులకు సహకారమని చెప్పారు. ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన జాతీయ ఇంధన పరి రక్షణ వారోత్సవాల పోస్టరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ కె.తిలక్ కుమార్, ఈఈ ఎన్.శామ్యూల్, వై.డేవిడ్, వై.నా రాయణ,అప్పారావు, డి.శ్రీధర్‌వర్మ పాల్గొన్నారు.