గోదారిలో దిగి..చచ్చిపోదామని..
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:58 AM
వయోభారం వృద్ధులకు శాపంగా మారుతోంది.. కొంత మంది చూసేవారులేక..మరికొంత మంది చూసేవారున్నా అనారోగ్య సమస్యల కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు..
కాపాడిన స్థానికులు.. పోలీసులకు అప్పగింత
కొవ్వూరు,నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : వయోభారం వృద్ధులకు శాపంగా మారుతోంది.. కొంత మంది చూసేవారులేక..మరికొంత మంది చూసేవారున్నా అనారోగ్య సమస్యల కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు..కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో శనివారం జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. ధవళేశ్వరం పోలీస్టేషన్ పరిధిలోని రాజవోలు గ్రామానికి చెందిన నిమ్మలపూడి సత్యనారాయణ(78) మూడు సార్లు సొ సైటీ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు.ఆయనకు ఇద్దరు కుమారులు..ఒక కుమార్తె.చాలా కాలం కిందట ఇద్దరు కుమారులు మరణించడంతో ప్రస్తుతం కుమార్తె వద్ద ఉంటున్నాడు.అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.ఆసు పత్రి ఖర్చుల కారణంగా కుటుంబీకులకు భారం కాకూడదని ఈ నెల 15వ తేదీ ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. రాత్రి కొవ్వూరు గోష్పాదక్షేత్రంలోనే బస చేశారు.శనివారం ఉదయం గోదావరిలో దిగి ఆత్మహత్యాయత్నా నికి ప్ర యత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.ఈ మేరకు పట్టణ సీఐ పి.విశ్వం సంఘటనా స్థలానికి చేరుకుని సత్యనారాయణను పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో శనివారం సత్యనారాయణ అదృశ్య మైన ట్టు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వివరాలు అడిగితెలుసుకుని రాజవోలు నుంచి కుటుంబీకులను రప్పించి అప్పగించారు.