ఓఎన్టీసీ గేటు వద్ద గ్రామస్థుల ధర్నా
ABN , Publish Date - Dec 15 , 2024 | 12:22 AM
కృష్ణాగోదావరి బెసిన్ పరిధిలో సుమారు 30 ఏళ్లుగా చమురు ఉత్పత్తులు తరలిస్తున్న ఓఎన్జీసీ ఓడలరేవులో స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రమోటక్ మెయింటెన్స్ కంపెనీలు ఇతరులకు ఉద్యోగాలు ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
అల్లవరం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): కృష్ణాగోదావరి బెసిన్ పరిధిలో సుమారు 30 ఏళ్లుగా చమురు ఉత్పత్తులు తరలిస్తున్న ఓఎన్జీసీ ఓడలరేవులో స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రమోటక్ మెయింటెన్స్ కంపెనీలు ఇతరులకు ఉద్యోగాలు ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్ గేటు వద్ద ఉదయం 7.30 నుంచి సాయంత్రం వరకూ బైఠాయించి నిరసన తెలిపారు. కొల్లు విష్ణుమూర్తి, నాతి లెనిన్‌బాబు, కొప్పాడి రామకృష్ణారావు, కలిగితి సత్యనారాయణ, మందపాటి రామకృష్ణ, గుబ్బల శ్రీను, పెచ్చెట్టి రామకృష్ణ, రేకాడి లోవరాజుతో పాటు గ్రామస్థులు తొమ్మిదిన్నర గంటల పాటు బైఠాయించి ఆందోళన చేశారు. అల్లవరం ఎస్‌ఐ జి.హరీష్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు జోక్యంతో ఓఎన్జీసీ అధికారులతో ఎస్‌ఐ హరీష్ గ్రామస్థులతో చర్చలు జరిపారు. రెండు రోజుల్లో స్థానికులకు ఉపాధి కల్పిస్తామని న్యాయం చేస్తామని ప్రమోటెక్ కంపెనీ ఎమ్మెల్యే ఆనందరావుకు హామీ ఇవ్వడంతో ఈ మేరకు గ్రామస్థులు ఆందోళన విరమించారు.