Share News

వరిలో సేంద్రియ సాగుతో మేలైన దిగుబడులు

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:20 AM

వరిలో సేంద్రియ ఎరువుల వాడకంతో మేలైన దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మాధవ రావు రైతులకు సూచించారు. రాజానగరం మండలం కానవరం, కడియం మండలం కడియపుసావరం గ్రామాల్లో మంగళవారం జరిగిన పొలం పిలు స్తోంది కార్యక్రమానికి ఆయన విచ్చేసి రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు.

వరిలో సేంద్రియ సాగుతో మేలైన దిగుబడులు
రాజానగరం: కానవరంలో రైతులకు సూచనలిస్తున్న మాధవరావు

  • జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు

  • పలుచోట్ల పొలం పిలుస్తోంది కార్యక్రమాలు

రాజానగరం/కడియం, అక్టోబరు 1: వరిలో సేంద్రియ ఎరువుల వాడకంతో మేలైన దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మాధవ రావు రైతులకు సూచించారు. రాజానగరం మండలం కానవరం, కడియం మండలం కడియపుసావరం గ్రామాల్లో మంగళవారం జరిగిన పొలం పిలు స్తోంది కార్యక్రమానికి ఆయన విచ్చేసి రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం తగ్గించి, ప్రకృతి సాగు చేయాలని చెప్పారు. అలాగే ఆకు ఎండు తెగులు సోకిన వరి పొలాల్లో నత్రజని వాడకం తగ్గించి పొటాష్‌ ఎరువును ఎకరాకు ఎంవోపీ 20 కిలోల చొప్పున ప్రస్తుతం ఉన్న పొట్టదశలో వేయాలని సూచించారు. తెగులు వ్యా ప్తిని కొంతవరకు నివారించేందుకు 1గ్రాము ప్లాటోమైసిన్‌, 3 గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా 2గ్రాముల కాపర్‌ హైడ్రాక్సైడ్‌, 53.8 డిఎఫ్‌(కోసైడ్‌), లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. రైతులకు వ్యవసాయశాఖ 50శాతం రాయితీపై సూక్ష్మపోషకాలను అందిస్తోందని, వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఒక్కో రైతుకు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో కానవరం నుంచి ఏవో ఎస్‌కే ఇమామి ఖాసిం, సొసైటీ సీఈవో నల్లమిల్లి దుర్గారావు, కడియపుసావరంలో సర్పంచ్‌ చెక్కపల్లి మురళి, పాలెం సర్పంచ్‌ అన్నందేవుల చంటి, ఏవో ద్వారకాదేవి, ఉద్యానాధికారి సుధీకర్‌కుమార్‌, ఏఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:20 AM