Share News

వాట్సాప్‌తో ధాన్యం కొనుగోళ్లు

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:08 AM

ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న అన్నదాతకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు పంపింది.ధాన్యం విక్ర యాల్లో అన్నదాతలు పడుతున్న అవస్థ లను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభు త్వం వాట్సాప్‌ ద్వారా ధాన్యం విక్రయిం చేలా ప్రత్యేక నెంబరును అందుబాటు లోకి తెచ్చింది.

వాట్సాప్‌తో ధాన్యం కొనుగోళ్లు
రాజానగరంలో చక్కర్లు కొడుతున్న పాంప్లెట్‌

రాజానగరం,నవంబరు 20 (ఆంధ్ర జ్యోతి) : ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న అన్నదాతకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు పంపింది.ధాన్యం విక్ర యాల్లో అన్నదాతలు పడుతున్న అవస్థ లను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభు త్వం వాట్సాప్‌ ద్వారా ధాన్యం విక్రయిం చేలా ప్రత్యేక నెంబరును అందుబాటు లోకి తెచ్చింది. అన్నదాతలు ముందుగా ప్రభుత్వం సూచించిన వాట్సాప్‌ మొబైల్‌ 73373 59375 నంబరుకు రైతు తన మొబైల్‌ ద్వారా హాయ్‌ అని మెసేజ్‌ చేస్తారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫ రాల సంస్థ తక్షణ స్వాగతం పలుకు తుంది. ధాన్యం అమ్మే సమయాన్ని షెడ్యూల్‌ చేసుకోమని చెబుతుంది. ఇందు కు షెడ్యూల్‌ బటన్‌ క్లిక్‌ చేసి ఆధార్‌ నంబరును ఎంటర్‌ చేయాలి. వెంటనే ధాన్యం అమ్మాలనుకున్న కొనుగోలు కేం ద్రం పేరును క్లిక్‌ చేయాలి. మీరు ఏ రోజు ధాన్యాన్ని అమ్మాలనుకుంటున్నారో ఆ తేదీని,ఆ రోజు ఏసమయంలో అమ్మ దలచుకున్నారో టైమ్‌ స్లాట్‌ ను ఎంచు కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అమ్మాలనుకున్న ధాన్యం ఏ రకానిదో క్లిక్‌ చేసి చెప్పాలి. అ తర్వాత ఎన్ని బస్తాలు అమ్మదలచుకున్నారో చెప్పాలి. అంతే మీ ధాన్యం కొలుగోలు ప్రక్రియ నిర్ధారించ బడుతుంది.సంబంధిత వివరాలతో పాటు ఒక కూపన్‌ కోడ్‌ ఇస్తూ సదరు మొబై ల్‌కు ఒక మెస్సేజ్‌ వస్తుంది. దీని ప్రకారం ఆ సమయానికి వెళ్లి ఎలాంటి నిరీక్షణ లేకుండా ధాన్యాన్ని అమ్ముకోవచ్చు.

Updated Date - Nov 21 , 2024 | 01:08 AM