కొనుగోళ్లకు ఓకే.. కోతల్లేవ్!
ABN , Publish Date - Nov 15 , 2024 | 12:59 AM
ఖరీఫ్ కోతల్లో జాప్యం కారణంగా ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. గతేడాది కంటే కనీసం వారం రోజులు వెనకబడినట్టు అధి కారులు చెబుతున్నారు.
కోతల్లో తీవ్ర జాప్యం
సగం కూడా పూర్తికాని వైనం
కొనుగోలు కేంద్రాల ఎదురుచూపులు
రెండు మండలాల్లో బోణీ లేదు
72,248 హెక్టార్లలో సాగు
15,348 హెక్టార్లలో మాసూళ్లు
46,809.28 టన్నులే సేకరణ
ధాన్యం విలువ రూ.107 కోట్లు
జమ చేసింది రూ.63.09 కోట్లు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
ఖరీఫ్ కోతల్లో జాప్యం కారణంగా ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. గతేడాది కంటే కనీసం వారం రోజులు వెనకబడినట్టు అధి కారులు చెబుతున్నారు.డిసెంబర్ 15వ తేదీ వర కూ కోతలు జరిగే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ధాన్యం దిగుబడి తగ్గి ఎకరానికి 33 నుంచి 38 బస్తాల వరకూ దిగుబడి వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.ఈ సారి ధాన్యం కొనుగోళ్లకు కూట మి ప్రభుత్వం పడగ్బంధీ ఏర్పాట్లు చేసింది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ సారి రైతులకు డబ్బు వెంటనే ఖాతాల్లో జమ చేస్తున్నా రు.
72,248 హెక్టార్లలో సాగు..
జిల్లావ్యాప్తంగా 72,248 హెక్టార్లలో వరి సాగు చేశారు. దాని దిగుబడి లక్ష్యం 5లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించారు. అందులో సుమారు 2.3 లక్షల టన్నుల వరకూ పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేస్తుంది. అయితే ఇప్పటి వరకూ కేవలం 15,384 హెక్టార్లలో మాత్రమే మాసూళ్లు జరిగింది.1,01,942 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. అందులో కస్టమ్స్ మిల్లింగ్‌కు పౌర సరఫరాల శాఖ రైతు సేవా కేంద్రాల ద్వారా 46.809.28 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది.వాటి విలువ రూ.107 కోట్లు.ఇప్పటికే రైతు ఖాతాల్లో రూ.63.09 కోట్లు జమ చేశారు. ఇప్పటి వరకూ 56,369.936 మెట్రిక్ టన్నులకు సంబంఽధించి మొత్తం 8785 కూపన్లు జారీ చేశారు. జిల్లాలో 18 మండలాలు ఉండగా 16 మండలాల్లో ధాన్యం కొనుగోలు మొదలైంది. 221 రైతు సేవా కేంద్రాలు ఉండగా 151 కేంద్రాలలో కొనుగోళ్లు సాగుతున్నాయి.ఇప్పటి వరకూ మొత్తం 5922 మంది రైతుల నుంచి 46,809.280 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దాని విలువ రూ.107.67 కోట్లు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు (పీపీసీ) స్థాయిలో రూ. 2.11 కోట్లు చెల్లించడానికి రూ. 2.85 కోట్లు ఉండగా, రూ.77 లక్షల చెల్లింపు లను వివిధ కారణాల వల్ల తిరస్కరించారు.
అన్నదాతకు ఇబ్బంది లేకుండా..
కూటమి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లకు పగడ్బంధీ ఏర్పాట్లు చేశారు.గత వైసీపీ ప్రభుత్వం లో ధాన్యం కొనేవారు లేక, కొనుగోలు చేసిన ధాన్యానికి ఎప్పుడు డబ్బు పడుతుందో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలి సిందే. అయితే కూటమి ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఈ మేరకు 221 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేశారు. అక్కడకు శాంపిల్ తీసుకుని వెళితే, ధాన్యానికి సరిపడా సంచులు ఇస్తారు. అవి తీసుకుని ధాన్యం బస్తాల్లోకి ఎక్కించుకుంటే, వాహనాలు నేరుగా వచ్చి ధాన్యాన్ని రైతుకు నచ్చిన మిల్లుకు తీసుకుని వెళతాయి. రవాణా చార్జీలు కూడా రైతు బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం వేస్తుంది. ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లో ధాన్యం డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తు న్నారు. ధాన్యం రవాణాకు 1900 వాహనాలకు జీపీఎస్ పెట్టి అందుబాటులో ఉంచారు. ప్రస్తు తం 1400 వాహనాలు ధాన్యం రవాణా చేస్తు న్నాయి. సుమారు 46 లక్షల సంచులు ఆయా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు.ఙ
పచ్చిధాన్యానికి ధర తక్కువ
ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం క్వింటా కామన్ రకం ధాన్యం ధర రూ. 2300 కాగా 75 కేజీల బస్తా రూ.1725 వరకూ కొనుగోలు చేయా లి. ఆరిన ధాన్యానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రా ల్లో బాగానే వస్తుంది. పచ్చిగా ఉంటే 75 కేజీల బస్తా ధాన్యాన్ని రూ.1400 నుంచి రూ.1650 వరకూ మాత్రమే కొనుగోలు చేస్తున్నట్టు చెబుతు న్నారు.దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కోతలు.. కొనుగోళ్లు ఇలా..
గ్రామం కోతలు(హెక్టార్లు) కొనుగోళ్లు(టన్నులు)
నిడదవోలు 1725 10,289.28
కొవ్వూరు 1917 7,375.56
చాగల్లు 918 6,755.28
తాళ్ళపూడి 520 3,514.52
రాజానగరం 1359 3,461.16
దేవరపల్లి 410 3,443.76
నల్లజర్ల 30 2,690.80
ఉండ్రాజవరం 330 2,469.36
కడియం 390 2,248.44
అనపర్తి 2200 1,703.90
పెరవలి 360 1,098.76
బిక్కవోలు 2805 781.84
గోపాలపురం 191 429.76
రాజమండ్రిరూరల్ 384 376
గోకవరం 30 132.8
రంగంపేట 380 38.28
కోరుకొండ 550 0
సీతానగరం 250 0