పంటల నష్ట నివారణ చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Jul 25 , 2024 | 01:21 AM
అధిక వర్షాల కారణంగా మండలంలోని ఉద్యాన వన పంటలపై నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఉద్యాన శాఖ అధికారిణి భవిత అన్నారు. బుధవారం నల్లజర్ల మండలం తెలికిచర్ల,చోడవరం, ప్రకాశరావుపాలెం, నల్లజర్ల గ్రామాల్లో అధిక వర్షలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
నల్లజర్ల, జూలై 24: అధిక వర్షాల కారణంగా మండలంలోని ఉద్యాన వన పంటలపై నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఉద్యాన శాఖ అధికారిణి భవిత అన్నారు. బుధవారం నల్లజర్ల మండలం తెలికిచర్ల,చోడవరం, ప్రకాశరావుపాలెం, నల్లజర్ల గ్రామాల్లో అధిక వర్షలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బొప్పాయి పంట పసుపు రంగులోకి మారడం, కాండం కుళ్లు వంటి లక్షణాలు ఉంటే రెడోమిల్ 2 గ్రాములు ఒక లీటర్ నీటికి వేసి పిచికారీ చేయాలన్నారు. కురగాయల పంటలకు మూడు 19, 13 సున్న 45, యూరియా వంటి పోషకాలను పిచికారీ చేయాలన్నారు. అరటి పంట ఎక్కువరోజులు నీటి ముంపునకు గురైతే వేరే వ్యవస్థ దెబ్బతింటుందని నీటిని బయటకు పంపి ఒక్కో మొక్కకు 100 గ్రాముల యూరియా, 80 గ్రాము పోటాషియం వేయాలన్నారు. లేత ఆయిల్ ఫాం మొక్కలు మువ్వ నీట మునిగితే బావిస్టన్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి మువ్వలో పోసి మొక్కంత తడిచే విధంగా పిచికారీ చేయాలన్నారు.
నిలకడగా వరద
పెరవలి, జూలై 24 : గోదావరి వరద ఎగువ భాగంలో తగ్గుతున్నట్లు వార ్తలు వచ్చినప్పటికీ దిగువ భాగంలో మాత్రం అదేవిధంగా నిలబడి ఉంది. పల్లపు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు గోదావరి ఏటిగట్టును వరద నీరు తాకింది. దీంతో అరటి, కొబ్బరి, కూరగాయలు, పూల తోటల్లో వరద నీరు చేరింది.