Share News

‘తూర్పు’న వైసీపీకి షాక్‌

ABN , Publish Date - Nov 15 , 2024 | 01:06 AM

తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు అల్లుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేసిన ఎస్‌.రాజీవ్‌కృష్ణ గురువారం మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరారు.

‘తూర్పు’న వైసీపీకి షాక్‌
మంత్రి లోకేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరిన రాజీవ్‌కృష్ణ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఇతర నాయకులు

కొవ్వూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు అల్లుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేసిన ఎస్‌.రాజీవ్‌కృష్ణ గురువారం మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. రెండు రోజుల కిం దట ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రాజీవ్‌కృష్ణతో పాటు కొవ్వూరు, నిడదవోలు, చాగల్లు జడ్పీటీసిలు బొంతా వెంకటలక్ష్మి, కొయ్యా సూర్యారావు, గారపాటి విజయదుర్గా శ్రీనివాస్‌, ధర్మవరం ఎంపీటీసి జొన్నకూటి రోహిణి కోమలి, దొమ్మేరు సొసైటీ మాజీ అధ్యక్షుడు గారపాటి వెంకటకృష్ణ, కాపవరం సొసైటీ మాజీ అధ్యక్షుడు ముళ్ళపూడి కాశీ విశ్వనాఽథ్‌, తాళ్ళపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిబాబు, తాళ్ళపూడి సర్పంచ్‌ నక్కా చిట్టిబాబు, దాపర్తి శివప్రసాద్‌, మార్ని తారకరాము, వల్లూరి సత్యప్రసాద్‌, నీలం వీరభద్రరావు,ఉప్పులూరి రాజేంద్రకుమార్‌, మాజీ సొసైటీ అధ్యక్షుడు ఇమ్మణి వీరశంకరం, బండి అశోక్‌, నల్లా రామకిషోర్‌, నామా సురేంద్ర, దొప్పలపూడి వేణుకుమార్‌, ఎన్‌.దిలీప్‌ కుమార్‌, బొల్లిన సతీష్‌ తదితర వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.వీరందరికి మంత్రి లోకేష్‌ పసుపు కం డువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో వైజాగ్‌ ఎంపీ ఎం.భరత్‌, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు, సీనియర్‌ నాయకులు అల్లూరి విక్రమాదిత్య, కొత్తపల్లి ఆశిష్‌లాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2024 | 01:08 AM