23న పవన్‌కల్యాణ్ నామినేషన్
ABN , Publish Date - Apr 22 , 2024 | 01:01 AM
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఈనెల 23న పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు పిఠాపురం మండలం కుమారపురంలోని గోకులం గ్రాండ్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరావు వెల్లడించారు.
గొల్లప్రోలు నుంచి పిఠాపురం వరకు ర్యాలీ.. సాయంత్రం ఉప్పాడలో సభ
పిఠాపురం, ఏప్రిల్ 21: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఈనెల 23న పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు పిఠాపురం మండలం కుమారపురంలోని గోకులం గ్రాండ్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం ఉద యం పది గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని ని వాసంనుంచి పవన్ బయలుదేరి గొల్లప్రోలు, పిఠాపురం పట్టణాల మీదుగా ప్రదర్శనగా పాదగయక్షేత్రం వద్దకు చేరుకుంటారన్నారు. అక్కడినుంచి కాలినడకన పిఠాపురం మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి ఆర్వోకు నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు కొత్తపల్లి మండలం ఉప్పాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. పవన్ నామినేషన్ ర్యాలీకి తరలివచ్చి, బహిరంగసభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.