Share News

పెట్రోల్‌ లూజు అమ్మకాలు జరిపితే చర్యలు

ABN , Publish Date - May 21 , 2024 | 12:19 AM

పెట్రోల్‌ బంకుల్లో బాటిళ్లు, డబ్బాల్లో విడిగా పెట్రోల్‌ అమ్మకాలు జరిపితే చర్యలు తప్పవని మండపేట రూరల్‌ సీఐ శ్రీధర్‌ కుమార్‌ అన్నారు.

పెట్రోల్‌ లూజు అమ్మకాలు జరిపితే చర్యలు

రాయవరం, మే 20: పెట్రోల్‌ బంకుల్లో బాటిళ్లు, డబ్బాల్లో విడిగా పెట్రోల్‌ అమ్మకాలు జరిపితే చర్యలు తప్పవని మండపేట రూరల్‌ సీఐ శ్రీధర్‌ కుమార్‌ అన్నారు. రాయవరంలో ఆయన పెట్రోల్‌ బంక్‌లు, బాణ సంచా దుకాణదారులకు నోటిసులు జారీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్‌ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో మందుగుండు సామగ్రి ఎక్కువగా కొనుగోలుకు వస్తే అటువంటి వ్యక్తుల సమాచారం బాణసంచా దుకాణదారులు పోలీసులకు తెలియజేయాలని, గ్రామాల్లో ఎటువంటి సంబరాలకు అనుమతులు లేవన్నారు. గ్రామాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. అనంతరం సోమేశ్వరంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ వెంట ఎస్‌ఐ జి.నరేష్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 21 , 2024 | 12:19 AM