Share News

పీజీఆర్‌ఎస్‌కు దివ్యాంగుల క్యూ

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:12 AM

క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేసి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ పి . ప్రశా ంతి ఆదేశించారు.

పీజీఆర్‌ఎస్‌కు దివ్యాంగుల క్యూ
కలెక్టర్‌ వేదిక ఎదుట కిందనే కూర్చుని ఉన్న దివ్యాంగులు

రాజమహేంద్రవరం రూరల్‌, అక్టోబరు 21 : క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేసి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ పి . ప్రశా ంతి ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కు 144 అర్జీలు వచ్చాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అర్జీలు స్వీకరిం చారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ వచ్చే వారం నుంచి అర్జీదారులు నేరుగా సంబంధిత అధికారులను కలిసి అర్జీలు అందజేస్తారన్నారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో రెవె న్యూ శాఖకు 58 ఫిర్యాదులు, పోలీస్‌ శాఖ 23, పంచాయతీ రాజ్‌ 16, వ్యవసాయ శాఖ 10, ఇతర శాఖలకు 37 వచ్చాయని ఆన్‌లైన్‌లో 134, ఆఫ్‌లైన్‌లో 10 అర్జీలు స్వీకరించినట్టు తెలిపారు. బొమ్మూరు చెరువుగట్టు వద్ద వాసిరెడ్డి వెంకటేశ్వరావు స్థలంలో ఏర్పాటు చేసిన వైన్‌ షాపును తొలగించాలని మహిళలు ఫిర్యాదు చేశారు. జాంపేట చేపల మార్కెట్‌ బయట కొంత మంది అల్లరి చేస్తూ మార్కెట్‌లో తమను వ్యాపారం చేసుకోనివ్వకుండా బయటకు దుకాణాలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధిత వ్యాపా రులు ఫిర్యాదు చేశారు. ధవళేశ్వరానికి చెందిన కాంట్రాక్టర్‌ మేకా సత్యనారాయణ పంచాయతీ లో చేసిన పనులకు రూ.17 లక్షల బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని వాపోయాడు. బిల్లులు మంజూరు చేయకుంటే ఇక్కడే నిరాహారదీక్షకు అనుమతివ్వాలని కోరారు. పీజీ ఆర్‌ ఎస్‌కు రూ.15 వేల పెన్షన్‌కు అర్హత కల్పిం చాలని పెద్ద ఎత్తున దివ్యాంగులు తరలివచ్చారు.

డీపీవోలో గ్రీవెన్స్‌కి 28 అర్జీలు

రాజమహేంద్రవరం, అక్టోబరు 21 (ఆంధ్ర జ్యోతి): జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవా రం నిర్వహించిన పబ్లిక్‌ గ్రీవెన్స్‌(మీ కోసం)లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజ లు 28 అర్జీలను సమర్పించారు. వాటిని అడిష నల్‌ ఎస్పీ(శాంతి భద్రతలు) ఏవీ సుబ్బరాజు, స్వీకరించారు. బాధితుల సమక్షంలోనే సం బం ధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తగు ఆదే శాలు ఇచ్చారు. చట్ట పరిధిలో త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు.

Updated Date - Oct 22 , 2024 | 01:12 AM