తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం
ABN , Publish Date - Oct 29 , 2024 | 12:46 AM
పిఠాపురం, అక్టోబరు 28: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, వారి సంక్షేమానికి పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్య దర్శి లోకేశ్ ఎల్లప్పుడు ఆలో
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ
పిఠాపురం, అక్టోబరు 28: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, వారి సంక్షేమానికి పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్య దర్శి లోకేశ్ ఎల్లప్పుడు ఆలోచిస్తూ ఉంటారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో సోమవారం వర్మ ఆన్లైన్లో పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. అన ంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం రూ.100 సభ్యత్వంతో రూ.5లక్షల భీమా సౌకర్యాన్ని పార్టీ కల్పిస్తున్నదన్నారు. పార్టీ సభ్య త్వ నమోదులో అందరూ పాల్గొనాలన్నారు. ప్ర భుత్వ, పార్టీ కార్యక్రమాలు, సిద్దాంతాలను ప్రజలకు వివరించి వారిని పార్టీలో సభ్యులుగా చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.