Share News

అమరులకు.. జోహార్లు

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:10 AM

భరతజాతి రక్షణలో ప్రాణాలర్పించిన పోలీ సు అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్‌ ప్రశాంతి పేర్కొన్నారు.

అమరులకు.. జోహార్లు
పోలీస్‌ అమరవీరులకు సెల్యూట్‌ చేస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్‌, కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ తదితరులు

రాజమహేంద్రవరం,అక్టోబరు 21 (ఆంధ్రజ్యో తి): భరతజాతి రక్షణలో ప్రాణాలర్పించిన పోలీ సు అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయమని కలెక్టర్‌ ప్రశాంతి పేర్కొన్నారు. భద్రతా పరంగా ఎవరు ఆపదలో ఉన్నా రక్త సంబంధీకుల కంటే ముందుగా స్పందించే వాళ్లు పోలీసులని, ప్రజల రక్షణే పోలీసుల ధేయ్యమని ఎస్పీ నరసింహ కిషోర్‌ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రజా స్వామ్యాన్ని రక్షించడంలో పోలీసులు ప్రదర్శిం చిన త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వ హణలో ఈ ఏడాది దేశవ్యాప్తంగా 214 మంది భద్రతా సిబ్బందిని కోల్పోవడం జరిగిందన్నారు. వీరిలో మన రాష్ట్రానికి చెందిన నరేంద్ర, గణేశ్‌ ఉన్నారన్నారు. పోలీస్‌ కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. కోల్పోయిన ప్రాణా లను తిరిగి తీసుకురావడం సాధ్యం కాదని, కానీ వారి కుటుంబాలకు పోలీస్‌ శాఖ మొత్తం నిరం తరం అండగా ఉంటుందన్నారు. 11 రోజుల పాటు అమర వీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తు న్నామన్నారు. దీనిలో భాగంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ వివిధ కార్యక్రమాలు చేపడుతు న్నామని తెలిపారు. దేశ సేవకు పునరంకితమ వుదామని పిలుపునిచ్చారు. ప్రకాశంనగర్‌ పీఎస్‌ లో పనిచేస్తూ అనారోగ్యంతో మరణించిన ఏఎస్‌ఐ పి.శ్రీదేవి భర్త శేషు ప్రసాద్‌కి రూ.2.25 లక్షల చెక్కు, అనారోగ్యంతో మృతి చెందిన ఏఆర్‌ పీసీ శ్రీనివాసరావు భార్య నాగమణికి రూ.1లక్ష చెక్కును కలెక్టర్‌, ఎస్పీ అందజేశారు. అనంతరం పోలీసు అమర వీరుల స్థూపం వద్ద కలెక్టర్‌ ప్రశాంతి, జేసీ చిన్న రాముడు, ఎస్పీ నరసింహ కిషోర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, అడిషనల్‌ ఎస్పీ ఏవీ సుబ్బరాజు తదితరులు నివాళులర్పించారు. ఆయా కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated Date - Oct 22 , 2024 | 01:10 AM