ఓటుకు పోటెత్తిన ఉద్యోగులు
ABN , Publish Date - May 07 , 2024 | 01:05 AM
ఉద్యోగులు ఓటుకు పోటెత్తారు.. గత ఐదేళ్లుగా ఎప్పుడెప్పుడు ఓటేద్దామా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.. ఎందుకంటే ఉద్యోగుల్లో అంత వ్యతిరేకత ఉంది.
ఎక్కడికక్కడ క్యూకట్టిన ఉద్యోగులు..
రాజమహేంద్రవరం, మే 6 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగులు ఓటుకు పోటెత్తారు.. గత ఐదేళ్లుగా ఎప్పుడెప్పుడు ఓటేద్దామా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.. ఎందుకంటే ఉద్యోగుల్లో అంత వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఉద్యోగులు ఓటు వేయడానికి బారులుతీరారు. అన్ని జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి సోమవారం ఉద్యోగులు క్యూకట్టారు. గతంలో పోస్టల్ బ్యాలెట్‌కు ఇంత స్పందన ఉండేది కాదు. అయితే ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితి మారింది. ఉదయం నుంచి ఉద్యోగులు బారులు తీరారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పీవోలు, ఏపీవోలు, ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్, ఇతర అనుబంధ సిబ్బంది ఓటు హక్కు వినియో గించుకున్నారు. ఎంత మంది వినియోగించుకున్నారనే లెక్క రాత్రి 12 గంటల వరకూ తేలలేదు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని ప్యూచర్ కిడ్స్ స్కూల్‌లో నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారిణి మాధవీలత జేసీ తేజ్‌భరత్‌తో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఓటు విలువను ఉద్యోగులు, ఎన్నికల సిబ్బంది చాటి చెప్పారన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో, ఏడు చోట్ల శిక్షణ ఇచ్చామన్నారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే 32 విభాగాల ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు.రాత్రి 12 గంటలకు కూడా ఎంతమంది ఓటు హక్కు వినియోగిం చుకున్నారనే వివరాలు ప్రకటించ లేదు. కేవలం రాజానగరం నియోజకవ ర్గంలో మాత్రం 738 మందికి 703 మంది వినియోగించుకు న్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ దాదాపు ఓటింగ్ శాతం ఇలాగే ఉన్నట్టు సమాచారం.
ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు
దివాన్‌చెరువు, మే 6 : సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్ని కల విఽదులకు నియమితులైన పీవో, ఏపీవోలు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. పాలచర్లలోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే ఏర్పాటు చేశారు. ఆర్వో చైత్రవర్షిణి తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ 50 మంది ఓటర్లకు ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఓటింగ్ ప్రాంభమైందన్నారు. రాజానగరం నియోజవర్గానికి 460 మంది పీవో, ఏపీలను కేటాయించారన్నారు. వీరిలో నియోజకవర్గాల వారీగా రాజానగరంలో 40, అనపర్తిలో 17, రాజమండ్రి సిటీలో 95, రూరల్‌లో 75, కొవ్వూరులో 27, నిడదవోలు 44, గోపాలపురం 28, ఇతర జిల్లాలకు చెందిన 128 మంది ఉన్నారన్నారు. మొదటి రోజు పీవో, ఏపీవోలతో పాటు మరో 260 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. వీరు బీఎల్‌వోలు, ఎన్నికల విధులకు నియమితులైన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులన్నారు. ఎన్నికల సం ఘం ఆదేశాల మేరకు 7,8 తేదీల్లో ఆర్వో కార్యాలయంలో ఫెసిలిటేషన్ సెం టర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 8న ఓపీవోలు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును బీవీసీ కళాశాలలోని ఫెసిలిటేషన్ సెంటర్‌లో వినియోగించుకోవాలన్నారు. హోమ్ ఓటింగ్ ద్వారా 100 మంది ఓటర్లలోనూ, 98 మంది ఓటు వేశారని ఆర్వో తెలిపారు.
గోపాలపురాన ఓట్లు మాయం..?
నిలదీసిన ఉద్యోగులు.. ఆలస్యంగా ఓటింగ్
గోపాలపురం, మే 6: ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి సోమ వారం మొదటి విడత పోస్టల్ బ్యాలెట్ ఓటు నమోదు ప్రక్రియలో గంద రగోళం నెలకొంది. గోపాలపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయడానికి సోమవారం ఉదయమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. అక్కడ పోస్టల్ బ్యాలెట్‌లో ఓట్లు వేయడానికి 11 ఫెషిలిటియేటర్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే జాబితాలో తమ పేర్లు కనిపించకపోయేసరికి గందరగోళం ఏర్పడింది. తమ పేరు జాబితాలో లేదని కంగారుపడిన ఎన్నికల సిబ్బంది ఏఈఆర్వోను నిల దీశారు. దీంతో విషయం తెలుసుకున్న ఆర్‌వో సమస్యను పరిష్కరించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌ఓట్లు ప్రక్రియ ప్రారంభమైంది.