Share News

విద్యార్థినులు సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలి

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:22 AM

విద్యార్థినులు తమకు ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను దీటుగా ఎదుర్కొవాలని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు.

విద్యార్థినులు సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలి

అమలాపురం రూరల్‌, సెప్టెంబరు 15: విద్యార్థినులు తమకు ఎదురయ్యే సమస్యలను, సవాళ్లను దీటుగా ఎదుర్కొవాలని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. విద్యార్థినులకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, సవాళ్లను ఎదుర్కొనేందుకు మానసిక స్థైర్యాన్ని పెంపొందించే విధంగా శ్రీవిధ సేవా సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఇందుపల్లి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు శ్రీవిధ సేవాసంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థినులు విద్యతో పాటు వ్యాయామం, క్రీడల పట్ల మక్కువ చూపాలని సంస్థ చైర్మన్‌ పొలమూరి ప్రసాదరావు పేర్కొన్నారు. ఉపాధ్యక్షురాలు, ప్రముఖ సైకాలజిస్టు పొలమూరి శ్రీమౌన విద్యార్థినుల కోసం అన్ని పాఠశాలల్లోను అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. సంస్థ తరుపున బాలికలకు వివిధ రకాల గార్మెంట్లతో కూడిన కిట్లను ఎమ్మెల్యే అందజేశారు. గ్రామ సర్పంచ్‌ చొల్లంగి శివాలినీ-అప్పాజీ, బండారులంక సర్పంచ్‌ పెనుమాల సునీత, నాయకులు మల్లుల పోలయ్య, నాగిరెడ్డి తాతారావు, మోటూరి బాలాజీ, పిల్లా మంగతాయారు, గుమ్మడి ప్రసాద్‌, పొలమూరి ధరణి, వికాస జిల్లా మేనేజర్‌ గోళ్ల రమేష్‌, హెచ్‌ఎం వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:22 AM