Share News

‘సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళతాం’

ABN , Publish Date - Dec 03 , 2024 | 02:16 AM

తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 9 నుంచి తామం తా సమ్మెలోకి వెళతామని ఆంధ్రప్రదేశ్‌ మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ స్ప ష్టంచేసింది.

‘సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళతాం’

రాజమహేంద్రవరంసిటీ, డిసెంబరు2 (ఆం ధ్రజ్యోతి): తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 9 నుంచి తామం తా సమ్మెలోకి వెళతామని ఆంధ్రప్రదేశ్‌ మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ స్ప ష్టంచేసింది. ఈమేరకు సోమవారం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయం లో అధికారులకు వినతిపత్రం అందించారు. అనంతరం యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు కోటాని ముకుందరామ్‌, గుద్దాటి నరసింహమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమాదుల యేసుబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బుంగా యెషయారాజు, అధ్యక్షుడు సిరికి ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి పాలిక బాలభవాని కుమార్‌, ఉపాధ్యక్షుడు మందనక్క సాయిలు విలేకరులతో మాట్లాడారు. గత 25 ఏళ్లు ఔట్‌సోర్సింగ్‌లో చాలీచాలని వేతనాలతో కార్మికులంతా దుర్భరజీవితాలు గడుపుతున్నామన్నారు. టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌గా రెండు రకాలుగా మంచినీటి విభాగం, స్ట్రీట్‌లైట్‌ విభాగం, ఇండోర్‌ అవు ట్‌డోర్‌, వర్క్‌ఇన్స్‌స్పెక్టర్లు, కంప్యూటిర్‌ ఆపరేటర్లు, గార్డీనర్లు, డ్రైవర్లుగా పనిచేస్తున్న తమ కు వేతనాలు పెంచాలని టెక్నికల్‌కు రూ. 29,200, నాన్‌టెక్నికల్‌కు రూ.24,500 ఇవ్వా లని, 15 ఏళ్లుపైబడి కార్మికులను క్రమబద్ధీకరించాలని, విఽధుల్లో మరణించిన కార్మికుడికి రూ.10 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగమివ్వాలని డిమాండు చేశారు.

Updated Date - Dec 03 , 2024 | 02:16 AM