సమస్యలు పరిష్కరించాలని మహిళల నిరసన
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:06 AM
సమస్యలు పరిష్కరించాలంటూ మొగలికుదురు హైస్కూలు ప్రాంతానికి చెందిన మహిళలు శనివారం నిరసన తెలిపారు.
మామిడికుదురు, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలంటూ మొగలికుదురు హైస్కూలు ప్రాంతానికి చెందిన మహిళలు శనివారం నిరసన తెలిపారు. తాగునీరు అందడంలేదని, మానేపల్లి వాటర్ స్కీము ద్వారా తాగునీరు పంపిణీ పూర్తిస్థాయిలో జరగకపోవడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాటిపాక గ్రామానికి చెందిన డ్రైన్ నీరు తమ గ్రామంలోకి వస్తుందని దీన్ని అరికట్టాలంటూ నిరసన చేపట్టారు. కార్యక్రమంలో కాండ్రేగుల పద్మావతి, చిక్కం స్వాతి, పితాని మారుతీ, చొల్లంగి స్వర్ణకుమారి, తోలేటి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు