Share News

ప్రజల సొమ్ము రాళ్లపాలు

ABN , Publish Date - May 22 , 2024 | 12:49 AM

లక్షలాది రూపాయల ప్రజల సొమ్మును పెట్రోల్‌ బంక్‌ పేరుతో రాళ్లపాలు చేశారు. సీతానగరంలో వ్యవసాయ సహకార పరపతి సంఘం పెట్రోల్‌ బంక్‌ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని, పంచాయతీ నుంచి సదరు స్థలం లీజుకు తీసుకున్నారు. పెట్రోల్‌ బంక్‌ నిమిత ్తం ఒక భవనం నిర్మించి, పెట్రోల్‌ పోయడానికి మిషనరీని ఏర్పాటుచేశారు.

 ప్రజల సొమ్ము రాళ్లపాలు
ప్రైవేటు వాహనాల పార్కింగ్‌ ప్లేస్‌గా మారిన పెంట్రోల్‌ బంక్‌ స్థలం

  • ప్రైవేటు వాహనాలకు అడ్డా మారిన వైనం

  • చేపల మార్కెట్‌గా మారిన కొంత స్థలం

  • ఇంకొంతలో విగ్రహాల ప్రతిష్ఠకు దిమ్మ ఏర్పాటు

  • పట్టించుకోని సీతానగరం పంచాయతీ అధికారులు

సీతానగరం, మే 21: లక్షలాది రూపాయల ప్రజల సొమ్మును పెట్రోల్‌ బంక్‌ పేరుతో రాళ్లపాలు చేశారు. సీతానగరంలో వ్యవసాయ సహకార పరపతి సంఘం పెట్రోల్‌ బంక్‌ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని, పంచాయతీ నుంచి సదరు స్థలం లీజుకు తీసుకున్నారు. పెట్రోల్‌ బంక్‌ నిమిత ్తం ఒక భవనం నిర్మించి, పెట్రోల్‌ పోయడానికి మిషనరీని ఏర్పాటుచేశారు. అయితే ఈ నిర్మాణాలు పర్యావరణానికి ప్రమాదకరంగా ఉన్నాయని, ఇక్కడ పెట్రోల్‌ బంక్‌కు నిర్మాణం చేయకూడదని ప్రజా నివాసాల మధ్యన ఉందని, ఇక్కడ పూర్వం పెద్ద గొయ్యి ఉండేదని, దీని వల్ల ఇక్కడ లూజ్‌ సాయిల్‌ ఉంటుందని, పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేయకూడదని పర్యావరణ ప్రేమికుడు నకుల సురేష్‌ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. అప్పటికే సుమారు రూ.30 నుంచి 40 లక్షల వరకు ఖర్చుచేశారు. వివరాల్లోకి వెళితే.. సీతానగరం, లంకూరు, చినకొండేపూడి గ్రామాల్లోని వాడ కం నీరు, వర్షం నీరు పోవడానికి సీతానగం పంచాయతీ పరిధిలో రెండు పెద్ద గొతులున్నాయి. ఒకటి బస్టాండ్‌ పక్కన ఉన్న కుమ్మరి గొయ్యి కాగా రెండో నాలుగు బొమ్మల సెంటర్‌లో పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేస్తున్న చోటు ఉన్న గొయ్యి. మూడు గ్రామాల నీరు ఈ గోతుల్లోకి వెళ్ళవలసి ఉంది. అయితే నాలుగు బొమ్మల సెంటర్‌లో గొయ్యిని పూడ్చి గత ప్రభుత్వం స్కేటింగ్‌ పార్కు ఏర్పాటుచేసింది. చివరి దశకు చేరుకునే సరికి ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయి వృథాగా పడివుంది. ఈ స్థలంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక సహకార సంఘం చైర్మన్లను నామినేటెడ్‌ పద్ధతిలో నియమించారు. వీళ్లు, ప్రజా ప్రతినిధులు కలసి పెట్రోల్‌ బంక్‌ వ్యాపారానికి తెరదీశారు. దీని కోసం సీతానగరం పంచాయతీ ద్వారా సహకార సంఘం లీజుకు తీసుకుని సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయంలో లీజు రిజిస్ట్రేషన్‌ చేయించారు. తరువాత సుమారు రూ.30 నుంచి 40 లక్షల వరకు ఖర్చు చేసి పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేశారు. అయితే నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలతో పనులు నిలిచిపోయాయి. దీంతో సహకారం సం ఘం లీజు సొమ్ములు పంచాయతీకి చెల్లించకపోవడంతో పంచాయతీ ఆదాయానికి గండి పడింది. లీజు కూడా రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ గొయ్యిలోని సగం స్థలాన్ని పెట్రోల్‌ బంక్‌ కోసం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ స్థలం ప్రైవేటు వాహనాలకు అడ్డాగా మారింది. మిగిలిన స్థలంలో రోడ్డు వైపు విగ్రహాల ఏర్పాటుకు పెద్ద దిమ్మకట్టి అక్కడ ఒక విగ్రహం ఏర్పాటుచేశారు. కాని ఆ విగ్రహాన్ని ఆవిష్కరించలేదు. మిగిలిన స్థలం అనధికారికంగా చేపల మార్కెట్‌గా మారిపోయింది. అయినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు.

Updated Date - May 22 , 2024 | 12:49 AM