Share News

మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీరావు వర్ధంతి

ABN , Publish Date - Dec 23 , 2024 | 01:20 AM

మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ పీవీరావు వర్ధంతిని ముమ్మిడివరంలో మాలమహానాడు జేఏసీ, మాల ఉద్యోగసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

 మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీరావు వర్ధంతి

ముమ్మిడివరం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ పీవీరావు వర్ధంతిని ముమ్మిడివరంలో మాలమహానాడు జేఏసీ, మాల ఉద్యోగసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పోలమ్మ చెరువుగట్టున డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, పీవీరావు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా చీకురుమెల్లి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు ఎం.ఆశీర్వాదం, నాయకులు కాశి జగపతిరావు, కాశి జగ్జీవన్‌రామ్‌, మట్టా శ్రీను, కాశి వెంకటాచారి, దాసరి వెంకటరమణ, ఎన్‌.అబ్బులు, యలమంచిలి బాలరాజు, కాశి సిద్ధార్థవర్య, వడ్డి నాగేశ్వరరావు, జనార్థన్‌లతో పాటు పలువురు పీవీరావు అందించిన సేవలను కొనియడారు. అలాగే ముమ్మిడివరం నగర పంచాయతీ పోలమ్మచెరువుగట్టున ఉన్న జై బుద్ధ పార్కు వద్ద పీవీరావు వర్ధంతిని నిర్వహించారు. ముందుగా బుద్ధుని విగ్రహం వద్ద బుద్ధ వందనంచేసి అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం పీవీ రావు చిత్రపటానికి మాలమహానాడు నాయకులు నివాళులర్పించారు. వడ్డి నాగేశ్వరరావు, కాశి బాబూజీగ్జీవన్‌రామ్‌, ఎం.ఆశీర్వాదం, ఎన్‌.అబ్బులు, కాశి సింహాద్రి, సబ్బతి సత్యనారాయణ, యలమంచిలి బాలరాజు, జనిపెల్ల జనార్థనరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 01:20 AM