బిక్కవోలులో కనుల పండువగా రథోత్సవం
ABN , Publish Date - Dec 09 , 2024 | 01:11 AM
బిక్కవోలు, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు శ్రీకుమారసుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సం కనుల పండువగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోఛ్చారణలు, బ్యాండు మేళాల మధ్య ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి
వైభవంగా శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవాలు
బిక్కవోలు, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు శ్రీకుమారసుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సం కనుల పండువగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోఛ్చారణలు, బ్యాండు మేళాల మధ్య ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరెడ్డి రథాన్ని లాగి ఉత్సవాన్ని ప్రారంభించారు. రథం ముందు బిక్కవోలు శ్రీకుమారసుబ్రహ్మణ్యస్వామి కోలాట మండలి సభ్యుల కోలాటం, బ్యాండ్ కచేరిలు, కేరళ వాయిద్యాలు అందర్నీ అలరించాయి. స్వామివారి రథం వంగా వారి వీధి నుంచి మెయిన్‌రోడ్ మీదుగా రాజారావుపేట, గ్రామంలోని పురవీధుల గుండా సాగింది. అధిక సంఖ్యలో భక్తులు రథాన్ని లాగడానికి పోటీపడ్డారు. కార్యక్రమంలో లక్ష్మీగణపతి ఆలయ చైర్మన్ చాగంటి సాయిబాబారెడ్డి, కమిటీ సభ్యులు పాలచర్ల శివప్రసాద్‌చౌదరి, వంగా పుల్లా రెడ్డి, తొండాపు శ్రీనివాసరెడ్డి, మానుకొండ రాంబాబు, నందిపాటి కిషోర్‌రెడ్డి, గొర్రెల త్రిమూర్తులు, పల్లి రాజారె డ్డి, కొమ్మోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనపర్తి సీఐ సుమంత్ ఆధ్వర్యంలో పోలీసులు రథం చుట్టూ బందోబస్తు నిర్వహించారు.
బాణసంచా కాల్పులు, గ్రామోత్సవం
షష్ఠి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నిర్వహించిన శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి గ్రామోత్సవం, బాణసంచా కాల్పులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రామోత్సవంలో తీన్‌మార్, బ్యాండ్ కచేరీలు, నెమలి నాట్యాలు, నవదుర్గలు కనువిందు చేశారు. అలాగే బిక్కవోలు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బాణసంచా కాల్చివేత అందర్నీ మంత్ర ముగ్ధులను చేసింది. ఈతచెట్టు, మల్లెపందిరి, నిప్పులు వెదజల్లే షా ట్‌లు, రంగురంగుల కాంతులిచ్చే బిగ్ షాట్‌లు, నిప్పురవ్వలు విడుస్తూ వెళ్లే రాకెట్‌లు కాల్చారు.