రైల్వేలైన్ అభ్యంతరాలను పరిష్కరించాలి
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:48 AM
జాతీయ రహదారి-216, కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ పెండింగ్ కేసులు, అభ్యంతరాలను సత్వరం పరిష్కరించి పనుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం భూసేకరణ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కోర్టు కేసులు, నిర్వాసితులు కోల్పోతున్న భూములు, కట్టడాలపై వచ్చిన అభ్యంతరాల పరిస్థితుల స్థితిగతులపై కలెక్టర్ ఆరా తీశారు. గడువులోగా సమస్యలు పరిష్కరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
అమలాపురం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి-216, కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్ పెండింగ్ కేసులు, అభ్యంతరాలను సత్వరం పరిష్కరించి పనుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం భూసేకరణ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కోర్టు కేసులు, నిర్వాసితులు కోల్పోతున్న భూములు, కట్టడాలపై వచ్చిన అభ్యంతరాల పరిస్థితుల స్థితిగతులపై కలెక్టర్ ఆరా తీశారు. గడువులోగా సమస్యలు పరిష్కరించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కోనసీమ ప్రాంత అభివృద్ధికి ప్రఽధానమైన జాతీయ రహదారి, రైల్వేలైన్ ఏర్పాటుకు స్థానిక ప్రజానీకం కూడా తమ వంతు సహకారం అందించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. నిర్వాసితుల అభ్యంతరాలను సామరస్యపూర్వక వాతావరణంలో శాంతియుతంగా పరిష్కరించాలని సూచించారు. రైల్వేలైన్ భూసేకరణ ప్రక్రియ కోసం రెవెన్యూ, రైల్వే, సర్వే తదితర శాఖలతో నియమించిన బృందాలు సేకరించిన వివరాలను నిర్దేశిత ప్రొఫార్మాలో నింపి సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఆర్డీవో కె.మాధవి తదితరులు పాల్గొన్నారు.