రైల్వే లైన్ అలైన్‌మెంట్ మార్చాలి
ABN , Publish Date - Nov 14 , 2024 | 01:02 AM
రైల్వేలైన్ అలైన్‌మెంట్ కుదరదని గ్రామస్తులు సర్పంచ్ ఆధ్వర్యంలో రెవెన్యూ, రైల్వే అధికారులకు తెలిపారు.
మలికిపురం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రైల్వేలైన్ అలైన్‌మెంట్ కుదరదని గ్రామస్తులు సర్పంచ్ ఆధ్వర్యంలో రెవెన్యూ, రైల్వే అధికారులకు తెలిపారు. బుధవారం మట్టపర్రు, గుడిమెళ్లంకలలో రైల్వేలైన్ సర్వేకు రైల్వేలైన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు వెళ్లారు. గుడిమెళ్లంకలో సర్వే చేయడానికి ప్రయత్నించగా సర్పంచ్ బండి విజయకుమారి ఆధ్వర్యంలో గ్రామస్తులు మంచినీటి చెరువు మీదుగా లైన్ కుదరదని అధికారులకు తెలిపామని, జిల్లా కలెక్టర్ తగు నిర్ణయం తీసుకునే వరకు ప్రస్తుతం సర్వే ఆపాలన్నారు. తహశీల్దార్ టి.శ్రీనివాస్ వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. వారు ససేమిరా అనడంతో మట్టపర్రులో సర్వే కొనసాగించారు. తహశీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈవిషయాన్ని ఆర్డీవోకు వివరించామని, ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ముందుకు వెళతామన్నారు. తహశీల్దార్‌తో మాట్లాడిన వారిలో సర్పంచ్ నల్లి విజయకుమారిప్రసాద్, పి.రంగరాజు, ఎ.మాధవవర్మ, ఎ.మహేష్‌రాజు, కట్టా శ్రీనివాస్, బాలకృష్ణ తదితరులు ఉన్నారు.