రాజా ప్యానల్ నామినేషన్ దాఖలు
ABN , Publish Date - Sep 20 , 2024 | 01:03 AM
ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో టీడీపీ వాణిజ్య విభాగం నాయకుడు తవ్వా రాజా ప్యానల్ నామినేషన్ దాఖలు చేశారు. దీనికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ నేత గన్ని కృష్ణ, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, జనసేన నగరిఇంచార్జీ అనుశ్రీ సత్యనారాయణ, ఇన్నీసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ళ అచ్యుతరామారావు విచ్చేశారు.
ఏకగ్రీవానికి చర్చలు.. చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు
రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 19: ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో టీడీపీ వాణిజ్య విభాగం నాయకుడు తవ్వా రాజా ప్యానల్ నామినేషన్ దాఖలు చేశారు. దీనికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ నేత గన్ని కృష్ణ, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, జనసేన నగరిఇంచార్జీ అనుశ్రీ సత్యనారాయణ, ఇన్నీసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ళ అచ్యుతరామారావు విచ్చేశారు. రాజా నామినేషన్ పత్రాలను వారి చేతులమీదుగా ఎన్నిల అధికారికి సమర్పించారు. కార్యక్రమంలో చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, నందెపు శ్రీనివాస్, బూర్లగడ్డ సుబ్బారాయుడు, కాశి నవీన్‌కుమార్, వర్రే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు కూటమి నాయకులు చర్చలు జరుపుతున్నారు. రాజా ప్యానల్‌లో అన్నివర్గాలకు చెందిన వారు ఉండడంతో ఏకగ్రీవం చేయాలనే ఆలోచనతో చర్చిస్తున్నారు. రాజా ప్యానల్ నామినేషన్లు వేసినప్పటికీ పోలింగ్ జరగకుండా అందరి ఆమోదం పొందే విధంగా ప్రయత్నాలు సాగుతున్నాయి.