ఈ ధరలేంటి శివ..శివా!
ABN , Publish Date - Nov 19 , 2024 | 12:54 AM
శివుడికి అత్యంత ప్రీతిప్రామైన మాసం కార్తీకం. హరిహరులకు ఇష్టమైన ఈ నెలలో నోములు, నదీ స్నానాలకు, దీపారాధనకు ప్రాశస్త్యం ఉంది. ఇంతటి ప్రశస్తి కలిగిన కార్తీకంలో పూజా సామ గ్రి ధరలు కైలాసాన్ని తాకుతున్నాయి.
కార్తీకంలో మహా దోపిడీ
ఇష్టానుసారంగా ధరలు
భక్తులను మోసగిస్తున్న వైనం
నియంత్రణ లేకపోవడమే కారణం
కొబ్బరి కాయ ఒక్కటీ రూ.50
మామిడాకులూ అమ్మకం
కల్తీ ఆవు నెయ్యితో దీపారాధన
అగరబత్తీలదీ ఇదే పరిస్థితి
అంతటా పెరిగిన మోసం
కోట్లలో సాగుతున్న వ్యాపారం
చోద్యం చూస్తున్న అధికారులు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
శివుడికి అత్యంత ప్రీతిప్రామైన మాసం కార్తీకం. హరిహరులకు ఇష్టమైన ఈ నెలలో నోములు, నదీ స్నానాలకు, దీపారాధనకు ప్రాశస్త్యం ఉంది. ఇంతటి ప్రశస్తి కలిగిన కార్తీకంలో పూజా సామ గ్రి ధరలు కైలాసాన్ని తాకుతున్నాయి. ఇవేం ధరలు శివ శివా! అంటూ భక్తులు ఆ కైలాస వాసుడికి మౌనంగా విన్నవించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిన ధరలు చూసి సామాన్యుడు నొచ్చుకుంటున్నాడు. ఓ వైపు సంపూర్ణ పూజా సామగ్రి, కైంకర్యాలలో లోటు రాకూడదనే మనోభావన. మరోవైపు ధరలు వింటూ జేబులు తడుముకొనే దైన్యం. మామిడి ఆకులనూ కొనుక్కోవాల్సిన వైనం. దీంతో ఎంతో కొంత రాజీపడుతూ, మన్నించాలని భగవంతుడిని వేడుకొంటూ కార్తీకంలో పూజలను కానిచ్చేస్తున్నాడు. అన్ని మాసాల్లోనూ కార్తీకం సర్వశ్రేష్టమైనదని నమ్మకం.ఏడాదంతా ఎలా ఉన్నా ఈ ఒక్క నెలలో మాత్రం ఆధ్యాత్మిక వెల్లివిరుస్తోంది. దేవాలయా లు దైవ నామస్మరణతో మార్మోగుతుంటాయి. శివుడు, అయ్యప్ప,సుబ్రహ్మణ్య, ఆంజనేయ మాల ధారణకు ఈ మాసాన్నే ఎంచుకుంటారు. ఎన్ని రోజుల దీక్ష అయినా కార్తీకం పూర్తిగా కలి సొచ్చే విధంగా ప్రణాళిక వేసుకుంటారు. కార్తీకంలో నో ములు నోచుకోవడం,నదీ తీరాల్లో దీపాలు వెలి గించి దైవారాధన చేయడం కనిపిస్తుంది.దీనినే వ్యాపారులు సొమ్ము చేసు కుంటు న్నారు.ఇష్టాను సారం ధరలు పెంచి విక్రయించేస్తున్నారు. దీం తో భక్తులు ఈ ధరలేంటి శివ శివా అంటున్నారు.
పూజ సామగ్రి ధరలు అమాంతం పెరిగి పోయాయి. ఏ వస్తువు కూడా రూ.20కి తక్కువ లేకుండా ఉంది. చివరికి ఐదు కొమ్మల మామిడి ఆకులను రూ.20కి అమ్మేస్తున్నారు. పనస ఆకుల విస్తరి ధరా అంతే. పత్రి పేరుతో రకరకాల ఆకు లను అంగట్లో పెడుతున్నారు. రూ.10 పెడితే ఒత్తులు రావడం లేదు. కొబ్బరి కాయ రూ.20 మొదలుకొని రూ.50 వరకూ ఉంది. రైతు వద్ద అంత ధర లేకపోవడం గమనార్హం. దైవారాధనకు వినియోగించే కర్పూర అరటిపండ్లు డజను రూ.40 నుంచి గరిష్ఠంగా రూ.100 చెబుతున్నారు. రాజమహేంద్రవరంలో కొబ్బరి, అరటి హోల్‌సేల్ మార్కెట్లు ఉన్నాయి. స్టేడియం రోడ్డులో పెద్ద సం ఖ్యలో కొబ్బరికాయల దుకాణాలు ఉన్నాయి. గోదా వరి గట్టున రోజూ ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రామాల నుంచి రోజుకు 5 వేల అరటి గెలలు హోల్‌సేల్ మార్కెట్‌కి వస్తాయి. ఇక్కడ ధరలకు రిటైల్‌గా విక్రయించే రేట్లకు పొంతన ఉండడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరటి పండ్లు, అరటి డొప్పలు, అగరవత్తులు, తమల పాకులు, కర్పూరం.. అన్నిటి ధరలూ అధికంగానే ఉన్నాయి. ఒకప్పుడు రూ.10 ఉండే 50 గ్రాముల కర్పూరం బిళ్లల ప్యాకెట్ ఇప్పుడు రూ.40 అయి పోయింది. కాస్త మంచిది కావాలంటే రూ.160 వరకూ చెల్లించాలి. ధూప్‌స్టిక్స్ రూ.10 నుంచి రూ.30కి చేరిపోయాయి. అయ్యప్ప పడి పూజ నిర్వహిస్తే పువ్వులకు, పూజా సామగ్రికే 70 శాతం డబ్బులు ఖర్చయిపోతున్నాయి. రూ.20కి లెక్కపెట్టి మరీ 10 చొప్పున చామంతి, బంతి పువ్వులు ఇస్తున్నారు. సోమవారమైతే రూ.20కీ పువ్వులు రావడం లేదు. అగరవత్తుల కాస్త సువా సన వచ్చేవి కావాలంటే రూ.50 నుంచి ధర మొదలవుతుంది. ఇక అయ్యప్ప ఇరుముడికి కావాల్సిన సంచి, అభిషేకం కిట్టు, నెయ్యి, కొబ్బరి కాయలు, రవిక ముక్కలు, కొత్త టవల్, బియ్యం ధరలూ గతేడాదికి ఇప్పటికీ నూరు శాతం పెరి గాయి.దీక్షకు అవసరమైన పూసల మాలల రేట్లూ విపరీతంగా ఎక్కువయ్యాయి. గతంలో రూ.50కి దిరికే తులసి మాల ధర రూ.250కి చేరుకొంది. స్వచ్ఛమైన స్ఫటిక,చందనం పూసలు రాగితో గుప్పినవైతే రూ.1500, వెండితో కనీసం రూ.5 వే లు అవుతోంది.ఈ క్రమంలో దీక్ష పూర్తయ్యే సరికి వ్యయం లెక్కలోకి తీసుకుంటే ఐదేళ్ల క్రితా నికి ఇప్పటికీ 500 శాతం వ్యత్యాసం గమనించవచ్చు.
నెయ్యి తీరే వేరు ఈశ్వరా!
కార్తీకంలో దీపారాధనకు నూనె కంటే ఆవు నెయ్యి శ్రేష్టమని భావిస్తారు. ఆవు నెయ్యితో ఒత్తులు వెలిగిస్తారు.అయితే మార్కెట్‌లో నెయ్యి ఉత్పత్తికి, ధరలకు పొంతన కుదరడం లేదు. ప్రస్తుతానికి రూ.వెయ్యి వెచ్చించినా స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరకడం కష్టమే.అలాంటి పరిస్థి తుల్లో రూ.5కి కూడా ఆవునెయ్యి ప్యాకెట్ అని అమ్మేస్తున్నారు.ప్యాకెట్లపై బొమ్మలు చూసి ని జం తెలిసినా మనసును సముదాయించుకొని పూజకు వాడుకోవడం తప్పని పరిస్థితి.గేదె నెయ్యి కంటే ఆవు నెయ్యి ఉత్పత్తి చాలా తక్కు వగా ఉంటుంది. దీంతో కల్తీ నెయ్యిని పూజలకు వినియోగించాల్సి వస్తోంది.ఎక్కువ ధర పెట్టినా స్వచ్ఛమైన నెయ్యి దొరికితే అదృష్టమనే చెప్ప వచ్చు. నెయ్యిలో నూనె, డాల్డా, ఎసెన్సు కలిపేసి అమ్మేస్తున్నారు.నెయ్యి కిలో రూ.వెయ్యి పైనే విక్రయిస్తున్నారు.అది స్వచ్ఛమేనా అంటే చెప్ప డం కష్టమే. ఇక పూజకు వినియోగించే నూనె ధర పావు లీటరు రూ.70 అయిపోయింది.
పసుపు..కుంకుమ కల్తీవే..
పసుపు,కుంకుమ అయితే పూర్తి గా కల్తీవే వస్తున్నాయి. ఆవుపాలను అభిషేకానికి వినియో గిస్తారు.ఇవి పూర్తిగా కల్తీవే విక్రయిస్తు న్నారు. వాటి ధరలు తక్కువేమీ లేదు. 50 గ్రాముల పసుపు, కుంకుమ రూ.25 చొప్పున రేటు ఉంది. బ్రాండెడ్ కావాలంటే మరో రూ.10 ఇవ్వాల్సిందే. ఒకప్పుడు రూ.5కి 100గ్రాములు వచ్చే పటిక బెల్లం చిప్స్‌ప్యాకెట్ రూ.20కి చేరింది. ఇలా ఒక టేమిటి అన్ని ధరలూ పెరిగిపోయాయి. ఇక కొబ్బరికాయ ధర వింటే అమాంతం పడి పోతా రంతే. ఎందుకంటే ఒక్కో కాయ ధర రూ.40 నుం చి రూ.50 మధ్య ఉంది. రైతు వద్ద రూ.10లకు కూడా కొనని కొబ్బరికాయను ఆలయాల వద్ద రూ.20లకు విక్రయించడం గమనార్హం. ఇక అరటి పండ్లదీ అదే పరిస్థితి. కర్పూర డజను సైజు బట్టి రూ.50 నుంచి రూ.100లకు విక్రయిస్తున్నారు.5 అరటి ఆకులు రూ.30లు తీసుకుంటున్నారంటే ఎంత దోపిడీయో అర్ధం చేసుకోవచ్చు.ఇక దీపాలు వదిలేందుకు వినియోగించే అరటి పువ్వులు, డొప్పల ధర చూసి గ్రామస్తులు నోరెళ్లబెడు తు న్నారు.ఎందుకంటే ఒక్కో డొప్ప రూ.10.. అరటి పువ్వు అయితే రూ.30.. పట్టణవాసులు తెలియక ఎంత అడిగితే అంత ఇచ్చి దీపాలు వదులు కుంటున్నారు.తమలపాకులు, వక్క, ఒకటే మిటి పూజకు వినియోగించే అన్ని ధరలు అమా ంతం పెంచేశారు.ధరలపై కనీస నియంత్రణ లేక పోవ డంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కార్తీక మాసాన ఈ ధరలేంటి నమశ్శివాయ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.