రేషన్ మాఫియాపై మరింత నిఘా
ABN , Publish Date - Dec 04 , 2024 | 01:51 AM
రేషన్ మాఫియాను ఉక్కుపాదంతో మో పేందుకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధంచేసింది. ఈ నేపఽథ్యంలో పోర్టులో మరింత నిఘా పెంచింది.
రేయింబవళ్లు తనిఖీ చేసే విధంగా ఉద్యోగులకు షిప్ట్‌లు
ప్రత్యేక తనిఖీలకు ఐదు ప్రభుత్వ శాఖలతో కమిటీ
నేడు స్టెల్లా ఎల్ నౌకలో తనిఖీలకు బృందం
ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతున్న బృందం
కలెక్టరేట్(కాకినాడ),డిసెంబరు 3 (ఆంధ్రజ్యో తి): రేషన్ మాఫియాను ఉక్కుపాదంతో మో పేందుకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధంచేసింది. ఈ నేపఽథ్యంలో పోర్టులో మరింత నిఘా పెంచింది. అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు తోపాటు రేయింబవళ్లు తనిఖీలు చేసే విధంగా ఉద్యోగులను మూడు షిప్ట్‌ల్లో నియమిస్తోంది. కాకినాడ యాంకరేజ్ నుంచి పీడీఎస్ బియ్యం రవాణా చేయకుండా ఉండేందుకు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. పోర్టులో బొంబాయి కాటా, శక్తిగ్యాస్‌ల వద్ద ఉన్న రెండు చెక్‌పోస్టుల్లో 24 గంటలపాటు తనిఖీలు ఉండే విధంగా మూ డు షిప్ట్‌ల్లో ఉద్యోగులను నియమిస్తున్నారు. ప్ర తిరోజు వెయ్యి నుంచి 1100 లారీలు బియ్యం లోడ్‌తో కాకినాడ పోర్టుకు వస్తాయి. బియ్యం లారీల్లో ప్రతి ఒక్క బస్తాను తనిఖీ చేసి అక్కడ కక్కడే శాంపిల్స్ పరీక్షించే యంత్రాంగాన్ని ఏర్పా టుచేస్తున్నారు. జూన్ నెలలో మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేసిన తర్వాత జూలై నెలలో రెండు చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు తొలుత ఈ చెక్‌పోస్టులు సజావుగా నడిచినప్పటికీ తర్వా త క్రమంలో పగటిపూట పనిచేసి రాత్రి లారీ లను తనిఖీలు చేయకుండా వదిలేశారు. దీంతో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా యఽథావిధిగా జరిగింది. ఇటీవల కలెక్టర్ స్టెల్లా ఎల్ నౌకలో తనిఖీలు చేయడం, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తనిఖీలకు పోర్టు కు రావడంతో తనిఖీల్లో డొల్లతనం బయటపడింది. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం చెక్ పోస్టులను బలోపేతం చేయడంతో పాటు అదనపు చెక్‌పోస్టులను ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. రెవె న్యూ, పోలీసు, సివిల్ సప్లయిస్, పోర్టు, కస్టమ్స్ అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిత్యం పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించే విధంగా ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా సమాచారం అందిన వెంటనే ఈ కమిటీ తనిఖీలు చేస్తుంది. పీడీఎస్ బియ్యంగా గుర్తిస్తే సీజ్ చేస్తారు. ఇక బుధవారం ఉదయం 8.30 గంటలకు సముద్రంలో ఉన్న స్టెల్లా ఎల్ నౌక లోకి నూతనంగా ఐదు ప్రభుత్వ శాఖ ల అఽధికారులతో నియమించబడిన మల్టీ డిసిప్లినరీ కమిటీ వెళ్లనుంది. నౌకలో ఉన్న బియ్యాన్ని సమ్రగంగా తనిఖీ చేసి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. మరోవైపు పోర్టులో ఉన్న ఐదు సార్టెక్స్ మిల్లులపై ఉన్న తాధికారులు ఆరా తీస్తున్నారు. ఆ మిల్లులు ఎలాంటి అనుమతులు తీ సుకుని నిర్వహిస్తున్నారు. ఐదు మిల్లు లు ఎప్పటి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి, ఆయా మిల్లుల్లో పీడీఎస్ బియ్యం పాలీష్ చేసి ఏ మేరకు విదేశాలకు పంపిస్తున్నారు వంటి అంశాలను తనిఖీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గత ఐదేళ్లపాటు ఈ సార్టెక్స్ మిల్లుల్లో పెద్దఎత్తున పీడీఎస్ బియ్యం పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతి చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆ దిశగానూ కూపీ లాగుతున్నారు.