రేషన్ బియ్యం పక్కదారి!
ABN , Publish Date - Nov 16 , 2024 | 01:42 AM
పౌరసరఫరాల శాఖ మంత్రి ఎంత ప్రయత్నిం చినా రేషన్ బియ్యం పక్కదారి పడుతూనే ఉ న్నాయి. ఎందుకంటే అన్నీ తెలిసినా అధికార యంత్రాంగం కళ్లు మూసుకుని ఉండడమే.
రెండు చోట్ల సాగుతున్న దందా
మామూళ్ల మత్తులో అధికారులు
చూడనట్టు వదిలేస్తున్నవైనం
నిడదవోలు, నవంబరు 15 (అంధ్రజ్యోతి) : పౌరసరఫరాల శాఖ మంత్రి ఎంత ప్రయత్నిం చినా రేషన్ బియ్యం పక్కదారి పడుతూనే ఉ న్నాయి. ఎందుకంటే అన్నీ తెలిసినా అధికార యంత్రాంగం కళ్లు మూసుకుని ఉండడమే. గ్రామాల్లో బియ్యం ఎవరెవరు కొంటారు.. ఎక్క డికి తరలిస్తారనేది జనమెరిగిన సత్యం.. అయి నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గ్రామాల్లో పదుల సంఖ్యలో సచివాలయ సిబ్బంది ఉన్నా పక్కదారి పట్టడాన్ని ఆపలేకపోతున్నారు. రేషన్ బియ్యం చాలా మంది ఇంట్లో వినియోగిం చడానికి ఇష్టపడరు. ఈ నేపథ్యంలో అయిన కాడికి అమ్ముకుని సొమ్ములు చేసుకుంటు న్నా రు. ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వడానికి కేజీకి రూ.43లు ఖర్చు చేస్తుంటే ప్రజలు మాత్రం కేజీ రూ.17లకు విక్ర యించడం గమనార్హం. కొన్ని వేల టన్నుల బియ్యం మళ్లీ ఏమవుతున్నాయోనని ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. కొందరు ఈ ఉచిత బియ్యం కొనుగోలు చేసి అధిక ధరలకు కోళ్ల ఫారంలకు విక్రయించేస్తున్నారు. పేదల బియ్యం పక్కదారి పడుతున్నా అధికారులు అటు వైపు కన్నెత్తయినా చూడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు రేషన్ బియ్యం దందాను కుటీర పరిశ్రమగా మార్చేసి కొనుగోళ్లను యథేచ్ఛగా సాగించేస్తున్నారు.
దళారుల కొనుగోళ్లు..
జిల్లాలో ప్రతినెలా 1వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఎండీయూ వాహనాల ద్వారా తెల్లరేషన్ కార్డుదారులకు ఉచితంగా ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తుంది. కుటుంబంలో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. సుమారు ఒక్కో కుటుంబానికి 20 కిలోలలోపుగా బియ్యం పంపిణీ జరుగుతుంది. తెల్లరేషన్ కార్డుదారుల్లో ఎక్కువ మంది రేషన్ బియ్యాన్ని వినియోగించరు. తెల్లరేషన్ కార్డు ప్రభుత్వ పఽథకాలకు ప్రామాణికం కావడంతో తప్పని పరిస్థితుల్లో బియ్యం తీసుకుంటున్నారు. దీంతో కొందరు రేషన్ బియ్యాన్ని తెల్లరేషన్ కార్డుదారుల నుంచి కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేస్తున్నారు. నిడదవోలు మం డలంలోని సూరాపురం, చాగల్లు మండలంలోని కలవలపల్లి ఇలా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కొందరు రేషన్ బియ్యం కొనుగోలు విక్రయా లను కుటీర పరిశ్రమగా నిర్వహిస్తున్నారు. ఉచితంగా వచ్చే రేషన్ బియ్యం కిలో 17 రూపా యల చొప్పున కొనుగోలు చేసిన అక్రమార్కులు కిలో రూ.23లకు కోళ్ల ఫారాలకు, కొన్ని రైస్ మిల్లులకు విక్రయించేస్తున్నారు. కోళ్ళ ఫారా ల్లో కోళ్లకు ఆహారమైన నూక ధర పెరిగి ఎక్స్ పోర్ట్‌కు వెళ్లిపోవడంతో కొందరు యజమానులు రేషన్ బియ్యం కొనుగోలుకు తెరలేపారు. ప్రతి నెలా మొదటి 15 రోజులు రేషన్ బియ్యం కొనుగోలు చేసిన వారు మూటలు కట్టుకుని మోటారు సైకిళ్లపై కోళ్ల ఫారమ్‌లకు తర లించేస్తున్నారు. రేషన్ బియ్యం కోళ్ల ఫారమ్‌కు చేరిన క్షణాల్లోనే నూకగా మారిపోతుండడంతో విక్రయించే వారికి కొనుగోలు చేసే వారికి ఎటువంటి సమస్యలు తలెత్తడం లేదు. రేషన్ బియ్యం కొనుగోలు చేసే దళారులు అధికా రులకు ఎప్పటికప్పుడు మామూళ్లు ఇస్తున్నట్టు సమాచారం. అందుకే అటువైపు కన్నెత్తి చూడ డం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.