Share News

రావులపాలెం పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ దాడులు

ABN , Publish Date - May 26 , 2024 | 01:39 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ అధికారులు శనివారం అకస్మిక దాడులు చేశారు. రావులపాలెం టౌన్‌ సీఐ ఆంజనేయులు రూ.50వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబ డ్డాడు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ డి.శ్రీహరిరాజు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి...

రావులపాలెం పోలీస్‌స్టేషన్‌పై  ఏసీబీ దాడులు

రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ ఆంజనేయులు

రావులపాలెం, మే 25: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ అధికారులు శనివారం అకస్మిక దాడులు చేశారు. రావులపాలెం టౌన్‌ సీఐ ఆంజనేయులు రూ.50వేలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబ డ్డాడు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ డి.శ్రీహరిరాజు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి... గత నెల 16వ తేదీన రావులపాలెం మండలం పొడగట్లపల్లి వద్ద కోడిపందాల శిబిరంపై పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్టు చేశారు. అందులో రావులపాలేనికి చెందిన కుంచెర్లపాటి లక్ష్మణరాజు కూడా ఉన్నారు. లక్ష్మణరాజుపై చార్జిషీట్‌ ఓపెన్‌ చెయ్యకుండా ఉండేందుకు సీఐ ఆంజనేయులు రూ.50వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో లక్ష్మణరాజు రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లక్ష్మణరాజు నుంచి సీఐ రూ.50వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో దాడిచేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు.

Updated Date - May 26 , 2024 | 08:22 AM