Share News

రెవెన్యూ అంశాలపై అవగాహనతో ఉండాలి

ABN , Publish Date - Oct 04 , 2024 | 12:18 AM

రెవెన్యూ అంశాల పట్ల అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహనతో ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి పేర్కొన్నారు. అసైన్డ్‌ భూములు, భూ తనిఖీ రిజిస్ర్టేషన్‌ తదితర నివేదికలను సకాలంలో సమర్పించాలని ఆదేశించారు. అదనపు భూ పరిపాలన ముఖ్య కమిషనర్‌ ప్రభాకర్‌రెడ్డి గురువారం అమరావతి నుంచి జిల్లాలోని జేసీలు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

రెవెన్యూ అంశాలపై అవగాహనతో ఉండాలి
మాట్లాడుతున్న జేసీ నిషాంతి

అమలాపురం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ అంశాల పట్ల అధికారులు, సిబ్బంది పూర్తి అవగాహనతో ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి పేర్కొన్నారు. అసైన్డ్‌ భూములు, భూ తనిఖీ రిజిస్ర్టేషన్‌ తదితర నివేదికలను సకాలంలో సమర్పించాలని ఆదేశించారు. అదనపు భూ పరిపాలన ముఖ్య కమిషనర్‌ ప్రభాకర్‌రెడ్డి గురువారం అమరావతి నుంచి జిల్లాలోని జేసీలు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అసైన్డ్‌ భూముల రీ వెరిఫికేషన్‌, నీటి వినియోగదారుల సంఘాల అధీనంలో ఉన్న భూములు, జిల్లాస్థాయి మోనటరింగ్‌ అండ్‌ ఆడిట్‌ కమిటీల తనిఖీలు, లోకాయుక్త కేసులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ నిషాంతి సమీక్ష నిర్వహించారు. భూ పరిపాలనా అంశాలను సకాలంలో పరిష్కరించాలన్నారు. జిల్లాకు సంబంధించి యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టులు రెండు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని సకాలంలో సీసీఎల్యే కార్యాలయానికి పంపించాలన్నారు. నీటివినియోగదారుల సంఘాల వద్దనున్న భూములకు సంబంధించి నోటీసులు అందించాలన్నారు. సమాచార హక్కుచట్టం దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలన్నారు. రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రిలే ఉత్తర్వులను ఇప్పటికే జారీ చేసినట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, మదన్‌మోహనరావు, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ మురళీకృష్ణ, పరిపాలనాధికారి కడలి కాశీవిశ్వేశ్వరరావు, రెవెన్యూ ఉద్యోగులు చినబాబు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2024 | 12:18 AM